Posted on 2026-01-10 17:31:20
అప్పుడే మనం అనుకున్న ఆశయం నెరవేరుతుంది
మాల మహానాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ మహోత్సవం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మాలలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చి విజయం సాధించినప్పుడే మాల జాతి అనుకున్న ఆశయాలు లక్ష్యాలు మాల మహానాడు రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు చెరుకు రామచందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోఎస్ శనివారం జిల్లా మాల మహానాడు కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల్లో మాల సర్పంచులుగా, ఉప సర్పంచ్లు గా వార్డు మెంబర్లుగా విజయం సాధించిన వారికి ఆత్మీయ మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఆయా గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన మాల సర్పంచులు 58, ఉపసర్పంచులు గా ఆరుగురుని, వార్డు మెంబర్లుగా 13 మందిని గెలిచిన తమ జాతి బిడ్డలకు సన్మానించుకోవడం ఎంతో కారణంగా ఉందని ఆయన అన్నారు. ఇది శుభ పరిణామమని, జిల్లావ్యాప్తంగా 50 శాతం మన మాల జాతికి చెందినవారు గ్రామపంచాయతీ సర్పంచులుగా గెలవడం సంతోషకరమైన విషయం అన్నారు ఇదే స్ఫూర్తితో ప్రతి ఎన్నికల్లో మానజాతి కి చెందిన మాలలు అన్ని రంగాలతో పాటు రాజకీయాల్లో కూడా తమ ప్రతిభను చాటి తామేంటో చాటి చెప్పడం సంతోషంగా ఉందన్నారు. మాల సోదరులందరూ ఒకటై ఒకటి గుర్తుంచుకోవాలని రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నామని ఎవరూ తొక్కి వేస్తె మనము కుంగి పోకుండా మనలో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. వార్డు స్థాయి నుండి రాష్ట్రపతి పదవీ వరకు మన మాల జాతి వారు ఎదిగినప్పుడే మాలల హక్కులను సాధించవచ్చని ఆయన అన్నారు. మాల మహానాడు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చెరుకు రామచందర్ ను ఘనంగా సన్మానించారు. గా కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా కమిటీ అధ్యక్షులు సక్కీ విజయ్, మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభంజన్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గైని గంగారం, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, రేంజర్ల రాజేష్, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >