| Daily భారత్
Logo




రూ.10 కోట్లతో కాలభైరవ ఆలయ అభివృద్ధి చేపడతా

News

Posted on 2026-01-10 20:16:17

Share: Share


రూ.10 కోట్లతో కాలభైరవ ఆలయ అభివృద్ధి చేపడతా

ప్రతి భక్తుడు అలయ అభివృద్ధికి తన వంతు ఆర్థిక సహాయం అందించాలి

నూతన పాలకవర్గo సభ్యులు ఆలయ అభివృద్ధికి నిస్వార్థంతో పనిచేయాలి

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

డైలీ భారత్, కామారెడ్డి:దక్షిణ కాశీగా పేరుగాంచిన కాలభైరవ స్వామి అభివృద్ధికి 10 కోట్ల నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేపడుతానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. శనివారం కాలభైరవ స్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు. ఎంతో ప్రాచీన, మహి మాణిత్వం గల చరిత్ర కలిగిన కాలభైరవ స్వామి ఆలయ అభివృద్ధికి ప్రతిభక్తులు తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం అందించి ఆలయ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. నూతన పాలకవర్గ సభ్యులు ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. పదవులు అనేవి శాశ్వతం కాదని అవకాశం వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకొని మంచి పేరు ప్రఖ్యా తులు తెచ్చుకోవాలన్నారు. ఆలయ అభివృద్ధికి ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి, డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి, లా దృష్టికి తీసుకెళ్ళాను నిధుల మంజూరు కి కృషి చేస్తున్నట్లు తెలిపారు. తాను ఇక్కడే పెరిగిన పరిసరాలు ఉన్నాయని తన చిన్ననాటి జ్ఞాపకాలను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వివరించారు. ఎంతోమంది భక్తులు కాలభైరవుని పూజిస్తారని ఎంతో మహిమలు కలిగిన కాలభైరవుని పూజిస్తే అడ్డంకులు తొలగడమే కాకుండా ఎంతో అభివృద్ధి చెందుతామన్నారు. తమ కుటుంబం కూడా కాలభైరవుడు నీ భక్తుల మేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక కాలభైరవ స్వామి ఆలయం ఉందని అభివృద్ధి చేసి యాత్రికులకు సౌకర్యాలు కల్పిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆలయ కమిటీ చైర్మన్గా చింతల శంకర్, ఆలయ కమిటీ సభ్యులను ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లు , మాజీ సింగిల్ విండో చైర్మన్లు, ఎల్లారెడ్డి, సదాశివనగర్, రామారెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు గిరెడ్డి మహేందర్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, పద్మశాలి సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >