| Daily భారత్
Logo




శ్రీరాముడి ని ఎన్నికల ముందు వాడుకునే హక్కు బీజేపీకి ఎవరిచ్చారు..?

News

Posted on 2026-01-12 12:32:18

Share: Share


శ్రీరాముడి ని ఎన్నికల ముందు వాడుకునే హక్కు బీజేపీకి ఎవరిచ్చారు..?

ఆ పార్టీ వారు రాముడికి సభ్యత్వం ఏమైనా ఇచ్చారా..?

పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: కులం మతం పేరిట బీజేపి ఎన్నికల్లో కుట్రపూరిత రాజకీయాలు చేస్తుందని, శ్రీరాముడిని వాడుకునే హక్కు బీజేపీకి ఎవరిచ్చారని, ఎన్నికల సమయంలో ఏ లెక్కన ఆయనను వాడుకుంటారని, శ్రీరాముడేమైనా బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారా అని పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవతలు శ్రీరాముడు, శివుడు కేవలం బిజెపి వాళ్ళకి వర్తిస్తుందా..? శ్రీరాముడిని, శివుడిని కాంగ్రెస్ పార్టీలోని తాము పూజించమా అని ప్రశ్నించారు. దైవం కులాలు అందరికీ సమానమని దైవం పేరిట కుల రాజకీయాలు మత రాజకీయాలు చేయడం సరికాదని ఆయన తీవ్రంగా విమర్శించారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రం లోనే అత్యధిక స్థానాలు సాధించామని, జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాదించిందన్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీజెండా ఎగరవేస్తామని ఆయన జోష్యం చెప్పారు. నిజామాబాద్ జిల్లా విషయానికొస్తే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు మిగతా మూడు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆయన స్పష్టం చేశారు. బీఅరెస్ పాలనలో ఆర్థిక విద్వంసమైన రాష్ట్రన్ని తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగు చేశామన్నారు. ప్రజలు కోరుకునే వారికే కాంగ్రెస్ బీ పాంలు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన.. ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్ పది వేల కోట్లు కూడా పెట్టుబడులు తేలేదు...రేవంత్ సిఎం‌ అయ్యాక లక్షా 70 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారన్నారు. 5 లక్షల పై చిలుకు కోట్లు గ్లోబల్ సమ్మిట్ ద్వారా పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం చేసుకున్నామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం ఎక్కడా ఇవ్వడం లేదని, కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పేదలకు సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. ఇల్లు లేని పేద వారుండవద్దని

ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని, ఎన్నడూ లేనంత అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగినందున మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం గెలుస్తామని ధీమా  వ్యక్తం చేశారు. ఎన్నికలు రాగానే బీజేపి మతం పేరిట రాముడి పేరిట ఓట్లడుగుతూ లబ్ది పొందాలనుకోవడం శోచనీయం అన్నారు. ఉద్యోగాలిస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారన్నారు. దేవుడి పేరిట కాకుండా 12 ఏండ్లలో చేసిన అభివృద్ధి గురించి చెప్పి బీజేపి పార్టీ నేతలు రాబోయే ఎన్నికల్లో ప్రజలకు ఓట్లడగాలని ఎద్దేవా చేశారు.

దేవుడి పేరిట ఓట్లడిగే వారికి ఈసారి ఆ దేవుడితోపాటు  ప్రజలు కూడా బుద్ది చెప్తారన్నారు. పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. అదేవిధంగా జిల్లాలో క్రీడాభివృద్ది కోసం కృషి జరుగుతుందని, జిల్లాను స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతాం స్పష్ఠీకరించారు. రాజీ లేకుండా నిజామాబాద్ అభివృద్ధి కోసం పని చేస్తున్నామన్నారు.

రాబొయే ఎన్నికలలో జనసేన వచ్చినా, కవిత పార్టీ వచ్చినా స్వాగతం పలుకుతామని, ఎవరు వచ్చినా ప్రజల ఆదరణ పొందాలన్నారు. ఉద్యోగాలిస్తారనుకుంటే పేర్లు మార్చడానికే మోదీ పరిమితం అయ్యారని విమర్శించారు. ప్రజల జీవన స్థితిగతులు మార్చాలి కానీ, పేర్లు పేర్లు మారిస్తే ఒరిగేది ఏమీ లేదన్నారు. నిజామాబాదు ను ఇందూరు గా మారుస్తానంటున్న అర్వింద్ ఏడేండ్లలో  ఏం చేశారో చెప్పాలన్నారు. బీసీలకు 42 శాతం  రిజర్వేషన్ల కు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. కానీ ఆ రిజర్వేషన్లు ఆపుతుంది బీజేపీనే అని అన్నారు. 42 శాతం రిజర్వేషన్ ‌ల అంశం తేలాకే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచనతో సీఎం ఉన్నారన్నారు.‌ 24 నెలల్లోనే 80 వేల ఉద్యోగాలిచ్చామని, మరో మూడేండ్లలో మరో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ కథ ముగిసిందని, కవిత విమర్శలకు హరీష్, కేటీఆర్ ల వద్ద జవాబుందా అని ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బీన్ హుందాన్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి, నూడా చైర్మన్ కేశవేణు, నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు

Posted On 2026-04-10 21:55:23

Readmore >
Image 1

సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు

Posted On 2026-04-10 21:17:45

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు

Posted On 2026-04-10 21:16:25

Readmore >
Image 1

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు

Posted On 2026-04-10 20:50:16

Readmore >
Image 1

బొత్స తో తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ భేటీ

Posted On 2026-04-10 20:49:00

Readmore >
Image 1

పీజీ ఫలితాలు విడుదల

Posted On 2026-04-10 20:44:45

Readmore >
Image 1

బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-04-10 20:41:31

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ

Posted On 2026-04-10 20:39:34

Readmore >
Image 1

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ

Posted On 2026-04-10 18:20:34

Readmore >
Image 1

విద్యుత్ సంస్థలో సమ్మె సైరాన్...3వ రోజుకు సమ్మె చేరుకుంది

Posted On 2026-04-10 17:14:44

Readmore >