| Daily భారత్
Logo




కలెక్టర్ గా వచ్చిన వారం రోజుల్లోనే తమ ఆదేశాలు బేఖాతర్ చేసిన ప్రభుత్వ కీలక ఉద్యోగులపై కొరడా ఝాలిపించిన కలెక్టర్

News

Posted on 2026-01-13 09:12:05

Share: Share


కలెక్టర్ గా వచ్చిన వారం రోజుల్లోనే తమ ఆదేశాలు బేఖాతర్ చేసిన ప్రభుత్వ కీలక ఉద్యోగులపై కొరడా ఝాలిపించిన కలెక్టర్

ప్రజావాణి కి డుమ్మా కొట్టిన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ..

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: సరిగ్గా జిల్లాకు వారం రోజుల ముందు బదిలీపై వచ్చిన జిల్లా కలెక్టర్ ఇల త్రిపాఠి గతంలో అనే కలెక్టర్గా పనిచేసిన జిల్లాల్లో విధుల్లో నిక్కచ్చిగా కఠినంగా ఉంటూ జిల్లా పాలన వ్యవస్థను గాడిలో పెట్టిన పేరున్న కలెక్టర్ ఆమె జిల్లాకు వచ్చి రాగానే మొదటి ప్రజావాణిలో ప్రజల సమస్యల పరిష్కార వేదిక అయిన ప్రజావాణికి అన్ని శాఖల ఉన్నత అధికారులు తప్పకుండా హాజరుకావాలని ప్రజలు సమస్యలు ఏంటో ప్రజావాణి ద్వారా వినాలని ఆమె వచ్చి రాగానే అధికారులకు ఆదేశించారు. అయినప్పటికీ ఇన్నాళ్లు ప్రజావాణి అంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆయా శాఖ ఉన్నతాధికారులు ప్రజావాణికి హాజరు కాకపోగా కిందిస్థాయి సిబ్బందిని ప్రజావాణికి పంపిస్తూ నిర్లక్ష్యంగా చేతులు దులుపుకునేవారు. అయితే గత వారమే జిల్లాకు బదిలీపై వచ్చిన కలెక్టర్ ప్రజావాణిలో అన్ని శాఖల ఉన్నతాధికారులు తప్పకుండా హాజరు కావాల్సిందే అంటూ స్వయంగా కలెక్టరే చెప్పిన ఆమె ఆదేశాలను జిల్లా కు చెందిన ఆయా శాఖలో ఉన్న ఉన్నతాధికారులు బేఖాతలు చేశారు. దీంతో ప్రజావాణికి డుమ్మా కొట్టిన అధికారులపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తోలిసారి కొరడా ఝులిపించారు. ప్రజావాణి కార్యక్రమానికి పలు శాఖల అధికారులు గైర్హాజరు అయ్యారు. దీనిని గమనించిన కలెక్టర్  ప్రజావాణి వినతుల స్వీకరణ పూర్తయిన అనంతరం ఒక్కో శాఖ వారీగా అధికారులు హాజరు జాబితా పరిశీలించారు. సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణికి గైర్హాజర్ అయిన వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ముందస్తు సమాచారం అందించకుండా పలు శాఖల అధికారులు ప్రజావాణికి గైర్హాజరు కావడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. సదరు అధికారులకు షోకాజ్ మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ఇది మొదటి తప్పుగా భావించి, మెమోలతో సరిపెడుతున్నామన్నారు. ఇక నుంచి గైర్హాజర్ అయితే అధికారుల పై కఠిన చర్యలు ( వేతనాల్లో కోతలు తప్పవని) తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులు పాల్గొనాలని అన్నారు.

Image 1

బ్రైట్ LED లైట్లు.. స్టైల్ కాదు, ప్రాణాలకు ముప్పు!

Posted On 2026-06-19 12:35:32

Readmore >
Image 1

అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం

Posted On 2026-06-19 12:16:39

Readmore >
Image 1

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ

Posted On 2026-06-19 11:16:50

Readmore >
Image 1

దడ పుట్టిస్తున్న థార్‌ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...

Posted On 2026-06-19 11:14:35

Readmore >
Image 1

"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు

Posted On 2026-06-19 08:33:46

Readmore >
Image 1

అరవల్లి SI ఈట సైదులు సస్పెండ్

Posted On 2026-06-19 08:09:23

Readmore >
Image 1

శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం : మంజుల పత్తిపాటి

Posted On 2026-06-19 08:06:56

Readmore >
Image 1

"మెట్" టెండర్లలో అవకతవకలు అవాస్తవం

Posted On 2026-06-18 21:07:59

Readmore >
Image 1

మ‌హిళ గ్యాంగ్ రేప్‌.. మ‌ర్మాంగంలో బుల్లెట్

Posted On 2026-06-18 20:54:39

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం

Posted On 2026-06-18 20:52:31

Readmore >