Posted on 2026-01-17 15:24:07
ఏఐఎంఐఎం సూర్యాపేట జిల్లా జాయింట్ సెక్రటరీ మొహమ్మద్ గౌస్ ఖాన్
డైలీ భారత్, హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని చారిత్రకమైన ఉస్మానియా (వక్ఫ్)మస్జీద్‌లో నెలకొని ఉన్న సమస్యల పట్ల ముస్లిం సమాజం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తుందని ఏఐఎంఐఎం సూర్యాపేట జిల్లా జాయింట్ సెక్రటరీ మొహమ్మద్ గౌస్ ఖాన్ శనివారం సోషల్ మీడియా ప్రకటన ద్వారా తెలిపారు. వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న ఈ మస్జీద్‌లో పరిపాలనా నిర్లక్ష్యం, మౌలిక వసతుల లోపాలు, ఆర్థిక పారదర్శకత లేకపోవడం వంటి అంశాలు పెద్ద సమస్యలుగా మారాయని అన్నారు.
జానిమాజుల కొరత, అజాన్ మైకు ఏర్పాటు కొరకు పిల్లర్,మస్జీద్ ముందు భాగంలో రేకుల షెడ్ నిర్మాణం, వజూ ఖానా లో టైల్స్ ఏర్పాటు, మస్జీద్‌లో నీటి సప్లై కొరకు 2 మోటార్లు,చిన్న పిల్లలు మస్జీద్‌కు వచ్చి చదువుకోవడానికి మక్తబ్ సౌకర్యం లేకపోడం, ఖబ్రస్తాన్లో మోటార్, లైటింగ్ ఏర్పాటు,జనాజా గుసూల్ చేయించ డానికి ఇద్దరు వ్యక్తులను నియమించుట, వజూ కొరకు నీటి సదుపాయాలు, టాయిలెట్ల అపరిశుభ్రత వంటి సమస్యలతో ముస్లిం సోదరుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ముఖ్యంగా జుమ్మా నమాజ్, రమజాన్ వంటి రద్దీ సమయాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా ఉండవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదే విధంగాఉస్మానియా వక్ఫ్ కాంప్లెక్స్ ద్వారా అద్దెల రూపంలో వచ్చే ఆదాయంపై ఎలాంటి పారదర్శకత లేకపోవడం పట్ల అనుమానాలున్నాయన్నారు. ఖర్చుల వివరాలు బహిర్గతం చేయకపోవడం వల్ల ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయన్న అన్నారు.ఇంకా మస్జీద్‌కు చెందిన వక్ఫ్ భూములపై అక్రమ ఆక్రమణలు జరుగుతున్నప్పటికీ వాటిని తొలగించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆయన ఆరోపించారు.ఈ అంశంపై ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి ప్రభావవంతమైన చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు.
భద్రతా పరంగా సీసీ కెమెరాలు లేకపోవడం కూడా ఆందోళన కలిగిస్తుందని సరిఅయిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్ల మస్జీద్ భద్రతకే ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రమజాన్, బక్రీద్ వంటి ముఖ్య పండగ సందర్భాల్లో కూడా కనీస ప్రాథమిక ఏర్పాట్లు చేయడం లేదని ఆయన మండిపడ్డారు.ఈ నేపథ్యంలో ఉస్మానియా (వక్ఫ్) మస్జీద్ సమస్యలపై వక్ఫ్ బోర్డు తక్షణమే జోక్యం చేసుకుని బాధ్యతా యుతమైన ప్రత్యేక నిర్వహణ కమిటీని నియమించి మస్జీద్ నిర్వహణను పూర్తిగా పారదర్శకంగా చేయాలని గౌస్ ఖాన్ డిమాండ్ చేశారు.మస్జీద్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఆర్థిక లావాదేవీలపై ఆడిట్ నిర్వహించడం,అక్రమ ఆక్రమణలను తొలగించడం వంటి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులు, వక్ఫ్ బోర్డు నిర్లక్ష్య వైఖరిని వీడాలని లేనిపక్షంలో శాంతియుత ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >