Posted on 2026-01-18 16:28:55
వైరా బోడేపూడి వైద్య శిబిరం విజయవంతం
127వ నెల 425 మందికి ఉచితంగా వైద్య సేవలు
డైలీ భారత్, వైరా:వైరా సిపిఎం కార్యాలయం బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో ప్రతి నెల మూడవ ఆదివారం బోడేపూడి కళానిలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోడేపూడి వైద్య శిబిరాన్ని 127వ నెల విజయవంతంగా నిర్వహించారు. ఆదివారం బోడేపూడి వైద్య శిబిరం ద్వారా షుగర్, బిపి, కొలెస్ట్రాల్, గ్యాస్, అల్సర్ తదితర వ్యాధులతో బాధపడుతున్న 425 మంది పేద, మద్యతరగతి ప్రజలకు డాక్టర్ చీకటి భారవి, డాక్టర్ జట్ల రంగారావు, డాక్టర్ పిల్లలమర్రి సుబ్బారావు ఉచితంగావైద్య సేవలు అందించారు. బోడేపూడి వైద్య శిబిరం ద్వారా నెల రోజులకు సరిపడా మందులను కేవలం100 రూపాయలకే అందిస్తున్నారు. బోడేపూడి వైద్య శిబిరంపై పూర్తి నమ్మకంతో వేలాది మంది ప్రజలు గత పది సంవత్సరాల క్రితం నుంచి ఉచితంగా వైద్య సేవలు పొందుతున్నారు. ఈ సందర్భంగా బోడేపూడి కళానిలయం కార్యదర్శి బొంతు రాంబాబు, ప్రముఖ వైద్యులు డాక్టర్ చీకటి భారవి మాట్లాడుతూ ఆహార అలవాట్లు, నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న ఒత్తిడి వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అన్నారు. శరీర బరువును నియంత్రించుకోవాలని, చక్కెర, స్వీట్లు, కూల్ డ్రింక్స్ మొదలైన వాటిని పూర్తిగా మానేయాలని తెలిపారు. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు ఎక్కువగా తినాలని, ఒత్తిడి తగ్గించుకోవాలని, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు. శీతాకాలంలో చలి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా షుగర్ పేషంట్స్ గుండె సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోడేపూడి వైద్య శిబిరం బాధ్యులు సుంకర సుధాకర్, వాలంటీర్లు గుడిమెట్ల రజిత గుడిమెట్ల మోహన్ రావు, బొంతు సమత, మాదినేని రజిని, అనుమోలు రామారావు, మల్లెంపాటి ప్రసాదరావు, తోట నాగేశ్వరరావు, హరి వేంకటేశ్వరరావు, అమరనేని కృష్ణ, కంభంపాటి సత్యనారాయణ, ఐలూరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >