| Daily భారత్
Logo




బాలుడి ఆలోచన - ఐపియస్ అధికారి ప్రశంస

News

Posted on 2026-01-19 17:36:36

Share: Share


బాలుడి ఆలోచన - ఐపియస్ అధికారి ప్రశంస

శాంతి మార్గమే శరణ్యం 

యుద్ధంపై విద్యార్థి అభిమన్యు ప్రాజెక్టును ప్రశంసించిన జిల్లా ఎస్పీ

యుద్ధం వద్దు.. శాంతి ముద్దు

ఏడవ తరగతి విద్యార్థి అభిమన్యు ఆశయం!

డైలీ భారత్, కామారెడ్డి:మాచారెడ్డి మండలం మర్రి తండాకు చెందిన సబావత్ సదర్ నాయక్ కుమారుడు అభిమన్యు, ప్రస్తుతం కొంపల్లి శ్రీ చైతన్య పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. లోకం నలుమూలల జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న ఈ చిన్నారి మనస్సు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం సృష్టిస్తున్న విధ్వంసాన్ని చూసి చలించిపోయింది. ఎక్కడో జరుగుతున్న యుద్ధం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం, లక్షలాది మంది నిరాశ్రయులవ్వడం ఆ బాలుడిని తీవ్రంగా ఆలోచింపజేసింది.

ఇదే విషయాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలనే ఉద్దేశంతో అభిమన్యు మనుషుల మనసుని సైతం కరిగించే ప్రాజెక్టును కళ్లకు కట్టినట్లుగా సిద్ధం చేశాడు. యుద్ధం వల్ల కలిగే నష్టాలను, ప్రపంచానికి శాంతి ఎంత అవసరమో వివరిస్తూ తను రూపొందించిన ఆ ప్రాజెక్టును తన తండ్రి సదర్ నాయక్ తో కలిసి జిల్లా ఎస్పీ కి వివరించాడు.

చిన్న వయసులోనే ప్రపంచ శాంతి పట్ల అభిమన్యు చూపిస్తున్న తపనను చూసి జిల్లా ఎస్పీ గారు. ముగ్ధులయ్యారు. బాలుడు సిద్ధం చేసిన ప్రాజెక్టును ఆసక్తిగా పరిశీలించి, అతని మాటలను ఎంతో శ్రద్ధగా విన్న ఎస్పీ, "నీ ఆలోచనలు సమాజానికి ఒక దిక్సూచి వంటివి" అంటూ మనస్ఫూర్తిగా అభినందించారు. అనంతరం అభిమన్యు ముద్దుగా అడిగిన ఆటోగ్రాఫ్ విన్నపాన్ని మన్నిస్తూ ఎస్పీ సంతకం చేసి ఆ బాలుడిని ప్రోత్సహించారు. యుద్ధంపై ఆవేదనతో మొదలై, ఉన్నతాధికారి అభినందనల వరకు సాగిన అభిమన్యు ప్రయాణం ప్రస్తుతం అందరికీ స్ఫూర్తినిస్తోంది.


#YoungVisionary #PeaceMessenger #Kamareddy #PolicePride #PeaceNotWar

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >