Posted on 2026-01-19 17:47:10
"ప్రణాళిక బద్ధమైన చదువు విజయానికి మార్గం" అంశంపై మానసిక అవగాహన సదస్సు
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మండలం గర్గుల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఎక్సైజ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో "ప్రణాళిక బద్ధమైన చదువు విజయానికి మార్గం" అనే అంశంపై విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పై అవగాహన సదస్సు నిర్వహించినట్లు ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా మానసిక వైద్యాధికారి డాక్టర్ రమణ మాట్లాడుతూ.. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడే దేనినైనా జయించగలమని ఉద్ఘాటించారు. పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థులు ప్రణాళిక వేసుకొని చదువుకోవాలని, సందేహాలు ఏమైనా ఉంటే తమ ఉపాధ్యాయుల ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు. పరీక్షా కాలంలో విద్యార్థులకు ఏర్పడే మానసిక సమస్యలు, టీనేజీలో వచ్చే అవరోధాలను అధిగమించేందుకు విద్యార్థులతో చర్చించారు. ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని అటువంటిప్పుడే విద్యార్థులు చదువుపై ఇష్టంతో మార్కులు సంపాదిస్తారన్నారు. మార్కులు తక్కువ వచ్చాయని ఫెయిల్ అయ్యా మను మానసిక చింతను దరిచేరనీయరాదని, ఎటువంటి మానసిక సమస్యలు తలెత్తిన తమను సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఎక్సైజ్ ఎస్సై విక్రం కుమార్ మాట్లాడుతూ.. టీనేజ్లో విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసవ్వడం గత కొంతకాలంగా చూస్తున్నట్లు ఇప్పుడు కాకపోయినా రానున్న రోజుల్లో విద్యార్థులు చెడు వ్యసనాలకు దగ్గరయ్యే అవకాశం ఉండడంతో వాటి జోలికి వెళ్లకుండా ఉండేందుకు, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలను విద్యార్థులకు వివరించారు. తమ ఇళ్లల్లో కానీ తమ చుట్టుపక్కల ఇళ్లల్లో కానీ గ్రామాల్లో మత్తు పదార్థాలు ఎవరైనా వినియోగించిన కలిగి ఉన్న తమకు సమాచారాన్ని చేరవేయాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి క్రమశిక్షణాహితంగా ఉంటూ విజయాలను సొంతం చేసుకోవాలని సూచించారు. మానసిక సమస్యలు తలెత్తితే 14416ని, డ్రగ్స్ సంబంధిత సమాచారం తెలిస్తే 14446 ని సంప్రదించాలని తమ వివరాలను గోప్యంగా ఉంచుతామని జిల్లా సోషల్ వర్కర్ డా.రాహుల్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >