Posted on 2026-01-20 23:16:52
పెండింగ్ రోడ్లు, డ్రైన్లు, కరెంటు స్తంభాల మంజూరుకు డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సర్పంచ్‌లకు నిర్వహించిన శిక్షణ తరగతులలో భాగంగా వెంకటేశ్వరావు కాలనీ పంచాయతీగ్రామ పంచాయతీ సర్పంచ్ తేజావత్ సరితరతన్ నాయక్ తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ ని మర్యాదపూర్వకంగా కలిసి గ్రామ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా గ్రామంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రోడ్ల నిర్మాణ పనులు, కొత్తగా డ్రైన్ల ఏర్పాటు అవసరం, అలాగే కరెంటు స్తంభాల మంజూరు వంటి కీలక సమస్యలను డిప్యూటీ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు రోజువారీగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, గ్రామాభివృద్ధికి ఈ పనులు అత్యవసరమని ఆమె స్పష్టం చేశారు.
గ్రామ అభివృద్ధి పనులపై సానుకూలంగా స్పందించి, సంబంధిత శాఖ అధికారులకు తక్షణమే అవసరమైన ఆదేశాలు జారీ చేసి పనులు వేగంగా ప్రారంభించేందుకు చొరవ చూపాలని సర్పంచ్ వినతిపత్రం ద్వారా కోరారు. గ్రామ ప్రజల తరఫున సమస్యలను ధైర్యంగా, స్పష్టంగా ఉన్నతాధికారుల ముందు ఉంచిన సర్పంచ్ చొరవకు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి "పుట్టినరోజు", "వివాహ వార్షికోత్సవం రోజు" లలో సెలవులు : డిజిపి బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-27 22:00:34
Readmore >
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య చేత భర్త హత్య – నిందితురాలు అరెస్ట్
Posted On 2026-04-27 21:45:44
Readmore >
జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఉపాధ్యాయుల కొరతపై ఇన్చార్జి డిఈఓ వినతి
Posted On 2026-04-27 19:27:31
Readmore >