| Daily భారత్
Logo




ఘనంగా శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం

News

Posted on 2026-01-20 19:15:24

Share: Share


ఘనంగా శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం

పాల్గొన్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ 

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి మాత ఆలయంలో మంగళవారం రోజున ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం నిర్వహించారు. మంగళవారం ఉదయం నుండి వేద పండితుల ఆధ్వర్యంలో 102 గోత్రాలతో కూడిన కలశాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి వారి భజన కార్యక్రమాలను గత వారం రోజుల నుండి ఈ ఆత్మార్పణ కార్యక్రమానికి కృషి చేస్తున్న కమిటీ పనిచేస్తుందని అధ్యక్షులు  తెలిపారు. అమ్మవారి విశేష పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ వాసవి మాత ఆత్మార్పణ ఉత్సవాలకు ఆలయానికి విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తాను కూడా కట్టుబడి పని చేస్తానన్నారు. అనంతరం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.వాసవి మాత అమ్మవారి ఆత్మర్పణ దినోత్సవం కార్యక్రమాలు  విశేష భక్తుల ఆధ్వర్యంలో పండితులు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మొగిలిపల్లి భూమేష్ గుప్తా ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా భక్తుల ఆధ్వర్యంలో అమ్మవారి ఆత్మర్పణ దినోత్సవాన్ని కుటుంబ సభ్యులు మహిళలు భక్తులు అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అనంతరం భారీ ఎత్తున  అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆలయ కమిటీకుటుంబ సభ్యులకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. దీంతో ఈ కార్యక్రమాన్ని ముగించి మంగళవారం రోజున రాత్రి వరకు ప్రత్యేక భజన కార్యక్రమాలు నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మొగిలిపల్లి భూమేష్ గుప్తా కార్యదర్శి కూర శ్రీనివాస్, విశ్వనాథులరాజేందర్,ఉపాధ్యక్షులు సునీల్ కుబీ,యాదా అంజయ్య,గరిపల్లి శ్రీధర్ బంకటేష్ శీనన్న, మొగిలిపల్లి రమేష్ గుప్తా, మోత్కూరు శ్రీనివాస్,వెంకటేష్, నీల రాజు, కాసర్ల నరహరి,ఆలయ అర్చకులు కృష్ణమూర్తి శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి ఆత్మర్పణ కార్యక్రమం ని ఘనంగా నిర్వహించారు.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >