Posted on 2026-01-21 21:27:28
ఎస్సీ సంఘాల ఐక్యవేదిక డిమాండ్.
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎస్సీ డివిజన్లపై హైకోర్టులో బిజెపి పార్టీ వేసిన పిటిషన్ ను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని ఎస్సీ సంఘాల ఐక్యవేదిక బుధవారం డిమాండ్ చేసింది. ఇలా హైకోర్టులో పిటిషన్ వేయడం ఆ పార్టీకి సిగ్గుచేటు అని ఎస్సీ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎస్సీ లందరూ ఐక్యంగా ఉండి బిజెపి పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని వారు పిలుపునిచ్చారు. ఎస్సీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రెస్ క్లబ్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ చౌరస్తాలో బిజెపి దిష్టిబొమ్మ ను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఎస్సీ సంఘాల ఐక్యవేదిక నాయకులు పులి జైపాల్, మల్యాల గోవర్ధన్, బంగారు సాయిలు, షేక్ హుస్సేన్, మల్లని శివ మాదిగ తదితరులు మాట్లాడుతూ ఎస్సీల పట్ల బిజెపి వైఖరి మరో మారు బయటపడిందన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కేవలం ఎస్సీ డివిజన్ లు 39, 40, 44 లలో రిజర్వేషన్లను సవాలు చేస్తూ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతన్కర్ లక్ష్మీనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం పట్ల దళితుల పట్ల బిజెపి వైఖరి మరో మారు బయటపడిందని అన్నారు. 60 డివిజన్ లలో రిజర్వేషన్లపై పిటిషన్ వేయాల్సిన వారు, వారి రాజకీయ లబ్ధి కోసం కేవలం ఎస్సీ డివిజన్ల పై వేసి ఎస్సీలను రాజకీయ బలి పశువులుగా చేస్తున్నారని అన్నారు, ఎస్సీల జోలికి వస్తే బిజెపి కి తగిన గుణపాఠం చెబుతామని అన్నారు, నిజామాబాద్ నగరంలోని ఎస్సీలు బిజెపి పార్టీ మన పట్ల వ్యవహరిస్తున్న తీరును పసిగట్టి బిజెపి అభ్యర్థులను రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాలని వారిని ఓడించడమే మన ఐక్యతకు నిదర్శనం అని పిలుపునిచ్చారు. ఈ వైఖరికి నిరసనగా రాబోయే కాలంలో మరిన్ని ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టిఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ, మహిళా నాయకులు బంటు జ్యోతి, మాల మహానాడు నాయకులు వినయ్, దండు చంద్రశేఖర్, నీలగిరి రాజు, చందు, చంద్రకాంత్, రాజయ్య, భీమ్ ఆర్మీ అధ్యక్షులు అజయ్, జమాతే ఇస్లామీ హింద్ నాయకులు హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >