| Daily భారత్
Logo




వరుస దొంగతనాల కేసుల ఛేదన

News

Posted on 2026-01-23 18:44:28

Share: Share


వరుస దొంగతనాల కేసుల ఛేదన

నరసన్నపేట సర్కిల్ పరిధిలో వరుస దొంగతనాల కేసుల ఛేదన

ముగ్గురు నిందితుల అరెస్ట్

రూ.35 లక్షల విలువైన ఆస్తి స్వాధీనం

డైలీ భారత్, శ్రీకాకుళం: నరసన్నపేట సర్కిల్ పరిధిలోని జలుమూరు, సారవకోట, నరసన్నపేట, పోలాకి పోలీస్ స్టేషన్ పరిధిలో గల నగిరికటకం, జలుమూరు, సవిగారం, అల్లాడ, శ్రీముఖలింగం, కూన లచ్చుము నాయుడుపేట, బుడితి, కోమర్తి, తలసముద్రం తదితర గ్రామాలలో జరిగిన వరుస దొంగతనాల కేసులను పోలీసులు విజయవంతంగా ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కేసు ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నారు అని అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు తెలిపారు.

కేసు వివరాలను శుక్రవారం నరసన్నపేట సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో అదనపు ఎస్పీ పి. శ్రీనివాసరావు వెల్లడించారు.

 అరెస్ట్ అయిన నిందితులు:

A-1: చల్ల అచ్చుత రావు, S/o లేట్ సత్యనారాయణ, వయస్సు 35 సం., వెలమ కులం, గంగన్నపేట గ్రామం, అండవరాం పంచాయతీ, జలుమూరు మండలం.

A-2: పొన్నాన యోగేశ్వర రావు, S/o లేట్ తవుడు, వయస్సు 22 సం., వెలమ కులం, మాకివలస గ్రామం, జలుమూరు మండలం.

A-3: అల్లు నరేంద్ర కుమార్, S/o గోవిందరావు, వయస్సు 18 సం., వెలమ కులం, మాకివలస గ్రామం, జలుమూరు మండలం.

స్వాధీనం చేసుకున్న ఆస్తి (సుమారు రూ.35,00,000/- విలువ):

బంగారం : 31 తులాలు (సుమారు 373 గ్రాములు)

వెండి : 800 గ్రాములు

హోమ్ థియేటర్ : 01

డీజే సిస్టమ్ యాంప్లిఫైయర్ : 01

నేరానికి ఉపయోగించిన మహేంద్ర థార్ వాహనం (నెంబర్: PY 05 P 0017)

ఇన్వర్టర్ బ్యాటరీ.

వీరు ఈ క్రింది ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడ్డారు:

నగిరికటకం,జలుమూరు,కూన లచ్చుము నాయుడుపేట, కొమర్తి,బుడితి గ్రామం, బద్రి రోడ్డు,తలసముద్రం, అల్లాడ గ్రామం, మర్రివలస గ్రామం,బుడితి జంక్షన్,సైరిగాం గ్రామం,శ్రీముఖలింగం గ్రామం లలో నేరాలు పాల్పడ్డారు.

కేసు పూర్తి వివరాలు:

A-1 చల్ల అచ్చుత రావు SRK సప్లయర్స్ యజమానిగా ఉండగా, A-2 మరియు A-3 అతని వద్ద పనిచేస్తున్నారు. వ్యసనాలకు బానిసలైన వీరు గ్రామాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, రాత్రి సమయాల్లో టెంట్‌లకు ఉపయోగించే ఇనుప హుక్స్ సహాయంతో తాళాలు విరగగొట్టి దొంగతనాలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.

ఈ దినం ఉదయం జలుమూరు మండలం కొమనపల్లి జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ జరుగుతున్న సమయంలో, బంగారాన్ని అమ్మేందుకు మహేంద్ర థార్ వాహనంలో వెళ్తున్న నిందితులను పోలీసులు పట్టుకొని, వారి వద్ద నుండి దొంగ సొత్తు మరియు నేరానికి ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసునుటెక్కలి సబ్ డివిజన్ పోలీస్ అధికారి శ్రీ డి. లక్ష్మణరావు గారి పర్యవేక్షణలో, నరసన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం. శ్రీనివాసరావు గారు, జలుమూరు ఎస్‌.ఐ. బి. అశోక్ బాబు, పోలాకి ఎస్‌.ఐ. జి. రంజిత్, సారవకోట ఎస్‌.ఐ. బి. అనిల్ కుమార్, నరసన్నపేట ఎస్‌.ఐ. శేఖర్ రావు గార్ల బృందం సమర్థవంతంగా ఛేదినలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎం. ధర్మరాజు, ఎం. వెంకటేష్, టి. వెంకటరావు, ఎం. ధర్మరావు, ఎం. నాగరాజు, ఎం. దాలినాయుడు తదితర సిబ్బందిని జిల్లా పోలీసు ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి ఐపిఎస్ ప్రత్యేకంగా అభినందించారు.


#Andhra Pradesh Police Dgp #Andhra Pradesh #Srikakulam District Police

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >