| Daily భారత్
Logo




ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి : అదనపు కలెక్టర్ కె.చంద్రా రెడ్డి

News

Posted on 2026-01-23 18:51:39

Share: Share


ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి : అదనపు కలెక్టర్ కె.చంద్రా రెడ్డి

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : ప్రతి ఒక్కరు బాధ్యతగా ప్రతి ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ కె.చంద్రా రెడ్డి అన్నారు. 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కె.చంద్రా రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మన భారత దేశం ప్రపంచంలో అతి పెద్దదైన  ప్రజాస్వామ్య దేశమని, ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలని, ఓటు హక్కు విలువ మనతోపాటు, తోటి వారికి తెలియజేయలన్నారు. ఓటును తాత్కాలిక ప్రలోభాలకు లొంగకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మన భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల్లో మనమందరం బాధ్యతగా పాల్గొని ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు.

అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ "భారత దేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని" వివిధ శాఖల అధికారులు, సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, జిల్లా గ్రామీణాభివృద్ది పిడి మరియు స్వీప్ నోడల్ అధికారి శ్రీలత, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >