| Daily భారత్
Logo




రౌడీ షీటర్ ను కమిషనరేట్ పరిధి నుండి బహిష్కరించిన సిపి వరంగల్

News

Posted on 2026-01-23 19:03:55

Share: Share


రౌడీ షీటర్ ను కమిషనరేట్ పరిధి నుండి బహిష్కరించిన సిపి వరంగల్

డైలీ భారత్, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో శాంతి భద్రతల పరిరక్షణలో మిల్స్ కాలనీకి చెందిన రౌడీషీటర్‌ వంచనగిరి సురేష్ @ కోతి సురేష్ ను వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుండి బహిష్కరణ చేస్తూ వరంగల్  పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, ఐపిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

తొలిసారిగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజా శాంతి, భద్రతలకు భంగం కలిగిస్తున్న రౌడీషీటర్ వంచనగిరి సురేష్ @ కోతి సురేష్ (వయస్సు 31 సంవత్సరాలు) పై హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం, 1348 ఫస్లి (వరంగల్ మెట్రోపాలిటన్ ఏరియా పోలీస్ చట్టం, 2015) లోని సెక్షన్ 26(1) ప్రకారం ఆరు నెలలు బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఈ ఉత్తర్వుల జారీ అనంతరం మిల్స్ కాలని  ఇన్స్ స్పెక్టర్ రమేష్, ఎస్.ఐ సురేష్ నిందితుడు కోతి సురేష్ ను వరంగల్ పోలీస్ కమిషనరేట్ సరిహద్దులో సీపీ జారీచేసిన ఉత్తర్వులను అందజేశారు.

మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌కు చెందిన వంచనగిరి సురేష్ రౌడీషీటర్‌గా గుర్తించబడిన వ్యక్తి కాగా, అతనిపై గతంలో పలు తీవ్రమైన నేర కేసులు నమోదై ఉన్నాయి. ఆయా కేసులు ప్రజలలో భయాందోళనలను సృష్టిస్తూ, శాంతియుత జీవన విధానానికి ఆటంకం కలిగించినట్లు పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇతని అక్రమ కార్యకలాపాల కారణంగా ప్రజలు ఫిర్యాదులు చేయడానికి కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో, అతనికి కారణాలు చూపించాలని నోటీసు జారీ చేయగా, సంబంధిత అధికారుల ఎదుట హాజరుకాలేదు. ఎలాంటి వ్రాతపూర్వక వివరణ ఇవ్వకపోవడంతో, అతని వైఖరి ప్రజా శాంతికి ముప్పుగా మారిందని నిర్ధారణకు వచ్చారు.

అందువల్ల, ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని, వంచనగిరి సురేష్‌ను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి నుంచి ఆరు (6) నెలల కాలానికి వెంటనే బయటకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. కోర్టు హాజరు కోసం మాత్రమే ముందస్తు అనుమతితో కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వబడుతుంది.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజలు భయభ్రాంతులకు లోనుకాకుండా నేరాలపై సమాచారం అందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.


#TelanganaCOPs #TelanganaDGP #warangal #Hanumakonda #WarangalPolice

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >