| Daily భారత్
Logo




సమస్యల వలయంలో జాన్ పహాడ్ ఉర్స్‌ నిర్వహణ...యంత్రాంగం మౌనం

News

Posted on 2026-01-23 19:55:13

Share: Share


సమస్యల వలయంలో జాన్ పహాడ్ ఉర్స్‌ నిర్వహణ...యంత్రాంగం మౌనం

ఉర్స్ ఆధ్యాత్మిక ఉత్సవంగా నిలవాలంటే నిర్లక్ష్య పాలనకు తెరపడాలి

పవిత్ర ఉర్స్‌ ఉత్సవ వైఫల్యానికి బాధ్యులు ఎవరు?

వక్ఫ్ బోర్డు నిర్లక్ష్యం...సమస్యల వలయంలో పవిత్ర ఉర్స్ ఉత్సవం

ఉర్సులో అస్తవ్యస్త ఏర్పాట్లు, అడ్డగోలుగా వసూళ్లు

డైలీ భారత్, హుజూర్ నగర్: ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రసాదించాల్సిన జాన్ పహాడ్ దర్గా ఉర్స్ ఈసారి అవస్థల ఉత్సవంగా మారింది. వేలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే ఈ పవిత్ర కార్యక్రమం, పరిపాలనా వైఫల్యాలు, వక్ఫ్ నిర్లక్ష్యం, సౌకర్యాల లేమితో సమస్యల వలయంలో చిక్కుకుంది. ఉర్స్ రోజుల్లో దర్గా పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిట లాడుతుంటే వారికి కనీస వసతులు కల్పించడంలో సంబంధిత శాఖలు ఘోరంగా విఫలమయ్యాయి.

కనీస సౌకర్యాలు లేక అల్లాడిపోతున్న  సైదన్న భక్తులు

తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి స్థలాలు వంటి ప్రాథమిక సదుపాయాలు కనీస స్థాయిలో కూడా లేకపోవడంతో మహిళలు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది ఉర్సా లేక పరీక్షా  అన్న స్థాయిలో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉర్స్ రోజుల్లో ట్రాఫిక్ నియంత్రణ ఇబ్బంది గా మారింది. అంబులెన్స్ వెళ్లేందుకు కూడా మార్గం లేని పరిస్థితి నెలకొనడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. భక్తుల సంఖ్యకు తగిన పోలీస్ బందోబస్తు లేకపోవడం, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే యంత్రాంగం స్పష్టంగా కనిపించకపోవడం ప్రమాదకర పరిస్థితులకు ఆహ్వానం పలికినట్టేనని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

వక్ఫ్ బోర్డు పనితీరుపై పలు అనుమానాలు

దర్గా నిర్వహణలో వక్ఫ్ కమిటీ పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వక్ఫ్ బోర్డు అధికారులుదళారులతో కుమ్మక్కయి  భక్తులను నిలువునా దోచుకుంటున్నారని

పెద్ద ఎత్తున విమర్శలున్నాయి

ఉర్స్ సందర్భంగా ఒక్క గొర్రెపోతు లేదా మేక పోతను హలాల్ చేస్తే రూ.1000 నుండి రూ.2000 దర్గాలో ఫతిహాలిస్తే రూ. 1000నుండి రూ.1500, తలనీలాలు అర్పిస్తే రూ.200 నుండి రూ.500 వరకు భక్తులను బెదిరించి వారి వద్ద నుండి అడ్డగోలుగా దోచుకుంటున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

 అనధికార దుకాణాలు...అధిక వసూళ్ల దోపిడీ

ఉర్స్ పరిసరాల్లో అనుమతి లేని దుకాణాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. భక్తుల నుంచి ఇష్టానుసారంగా ధరలు వసూలు చేయడం పట్ల ఎవరికి ఫిర్యాదులు చేయాలో కూడా స్పష్టత లేదు.

పారిశుధ్య లోపాలతో ఆరోగ్య ముప్పు

చెత్త తొలగింపు సరిగా జరగక దర్గా పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా మారాయి. ఇది వ్యాధుల ముప్పుకు దారితీసే పరిస్థితి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వక్ఫ్ బోర్డును, ప్రభుత్వాన్ని జిల్లా యంత్రాంగాన్ని తక్షణమే స్పందించాలంటూ అని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >