| Daily భారత్
Logo




పసికందును బావిలో పడేసిన కోతి.. కాపాడిన డైపర్

News

Posted on 2026-01-23 21:44:04

Share: Share


పసికందును బావిలో పడేసిన కోతి.. కాపాడిన డైపర్

డైలీ భారత్, ఛత్తీస్‌గఢ్‌: తల్లి చేతుల్లో ఉన్న పసికందును కోతి లాక్కెళ్లి బావిలో పడేస్తే.. చిన్నారికి వేసిన డైపర్‌ వల్ల ప్రాణాలు నిలిచిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. సియోని జిల్లాలోని గ్రామంలో ఓ మహిళ తన 20 రోజుల పసికందుతో ఇంటి బయట కూర్చుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన కోతులు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాయి. ఓ కోతి మహిళ ఒడిలో ఉన్న చిన్నారిని లాక్కెళ్లింది. వెంటనే మహిళ, చుట్టుపక్కల వారు అరుస్తూ దానిని వెంబడించారు.  దీంతో  కోతి దూరంగా ఉన్న ఓ బావిలో చిన్నారిని విసిరేసి వెళ్లిపోయింది. పసిబిడ్డ కోసం వెతుకుతూ వచ్చిన గ్రామస్థులకు చిన్నారి బావిలో తేలుతూ కనిపించడంతో వెంటనే రక్షించారు. పాపకు వేసిన డైపర్‌ లైఫ్ జాకెట్‌లా నీటిలో తేలడం వల్లే చిన్నారి ప్రాణాలు నిలిచాయని స్థానిక నర్సు రాజేశ్వరి పేర్కొన్నారు. బావిలో నుంచి తీసిన వెంటనే శిశువుకు అత్యవసర చికిత్స అందించారు. కోతులు, ఇతర అడవి జంతువులు తరచూ ఇళ్లలోకి వచ్చి దాడి చేస్తున్నాయని గ్రామస్థులు వాపోయారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవట్లేదన్నారు.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >