Posted on 2026-01-24 11:02:59
సస్పెన్షన్‌లో ఉన్న సబ్ రిజిస్ట్రార్‌పై డీఏ కేసు!
రూ.7.83 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు
డైలీ భారత్, రంగారెడ్డి:రంగారెడ్డి జిల్లా సంయుక్త సబ్ రిజిస్ట్రార్ (ఎస్‌ఆర్‌ఓ–1)గా పనిచేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న కందాడి మధుసూదన్ రెడ్డిపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (అనిశా/ఏసీబీ) అధికారులు అక్రమాస్తుల (డీఏ) కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా ఈరోజు అనిశా అధికారులు మధుసూదన్ రెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, అనుచరులకు సంబంధించిన మొత్తం ఏడు ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున స్థిర, చర ఆస్తులు వెలుగులోకి వచ్చాయి.
సోదాల్లో ఈసీఐఎల్ ప్రాంతంలో 300 చదరపు గజాల స్థలంలో నిర్మించిన మూడు అంతస్తుల భవనం, ఇబ్రహీంపట్నం మండలంలో ఒక బహిరంగ ప్లాటు మరియు ఒక ఎకరం వాణిజ్య భూమి, పరిగి మండలంలో 27 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఈత కొలను కలిగిన ఫామ్‌హౌస్‌ను అధికారులు గుర్తించారు.
అలాగే 1.2 కిలోల బంగారు ఆభరణాలు, మూడు నాలుగు చక్రాల వాహనాలు (ఫార్చ్యూనర్, వోల్వో, వోక్స్‌వ్యాగన్) మరియు రూ.9 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల మొత్తం విలువ (దస్తావేజు ప్రకారం) సుమారు రూ.7,83,35,302గా అధికారులు అంచనా వేశారు.
ఇదే సమయంలో ‘ఏఆర్‌కే స్పిరిట్స్’ పేరిట మద్యం వ్యాపారంలో సుమారు రూ.80 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు, అలాగే తన భార్య, పిల్లల పేర్లపై రెండు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు కూడా అనిశా అధికారులు గుర్తించినట్లు సమాచారం.
అదనపు అక్రమాస్తులపై విచారణ ఇంకా కొనసాగుతోందని, కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >