| Daily భారత్
Logo




కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టిన గంజాయి ముఠా

News

Posted on 2026-01-24 11:07:34

Share: Share


కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టిన గంజాయి ముఠా

డైలీ భారత్ నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారులో రూట్ వాచ్ ఆపరేషన్ సమయంలో గంజాయిస్ ముఠా ఎక్సైజ్ కానిస్టేబుల్ జి. సౌమ్యకు అతి దారుణంగా కారుతో ఢీ కొట్టిన సంఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం సుమారు 6:45 గంటల సమయంలో, నిజామాబాద్ పట్టణానికి ఎండుగంజాయి (డ్రై గంజా) తరలింపు జరుగుతోందన్న నమ్మదగిన సమాచారంపై ఆధారపడి, నిజామాబాద్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సీఐ ) ఆమె సిబ్బందితో కలిసి పట్టణ పరిధిలోని మాధవనగర్ ప్రాంతంలో రూట్ వాచ్ నిర్వహించారు.

ఆపరేషన్ సమయంలో ఒక కారును తనిఖీ కోసం ఆ వాహనాన్ని నిలువరించే ప్రయత్నం చేయగ ఆ వాహనం ఎక్సైజ్ కానిస్టేబుల్ జి. సౌమ్యను ఢీకొట్టింది. దీంతో ఆమె రోడ్డుపై పడిపోయారు. వెంటనే సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం నిజామాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్  హాస్పిటల్ కు తరలించారు.

సంఘటన సమాచారం అందిన వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు. వైద్య పరీక్షల అనంతరం, కానిస్టేబుల్ జి. సౌమ్యకు అంతర్గత పొట్ట గాయాలు అయినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు.

ఈ సంఘటనను నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆమె తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించబడింది. సంఘటనకు సంబంధించిన వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అదనంగా, వాహనం నుంచి సుమారు 2 కిలోగ్రాముల గంజాయిను స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >