Posted on 2026-01-24 16:37:52
మాట్లాడుతున్న పోతినేని సుదర్శన్ రావు
ప్రజా సమస్యలపై పోరాడే సిపిఐ(ఎం)ను ఆదరించండి
సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు
డైలీ భారత్, వైరా:రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఐ(ఎం) పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న సిపిఐ(ఎం) పార్టీ అభ్యర్థులను ప్రజలు ఆదరించాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ సమావేశం స్థానిక బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో పట్టణ నాయకురాలు మచ్చా మణి అద్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాడే సిపిఐ(ఎం) పార్టీ అభ్యర్థులను ప్రజలు ఆదరించి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. వైరా మున్సిపాలిటీలో జరిగిన అవినీతీకి వ్యతిరేకంగా నికరంగా పోరాడుతున్నామని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో సిపిఎం పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని, ఇంటి పన్నులు తగ్గించాలని, అన్ని వార్డులలో డ్రైనేజీ, వీధిలైట్లు, అంతర్గత రోడ్లు తదితర స్థానిక సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తున్న సిపిఎం పార్టీ అభ్యర్థులను రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, నాయకులు హరి వెంకటేశ్వరరావు, పైడిపల్లి సాంబశివరావు, రాచబంటి బత్తీరన్న, సంక్రాంతి నర్సయ్య, బొంతు సమత, గుడిమెట్ల మోహన్ రావు, కొంగర సుధాకర్, అనుమోలు రామారావు, షేక్ నాగుల్ పాషా, తోట కృష్ణవేణి, కామినేని రవి తదితరులు పాల్గొన్నారు.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >