| Daily భారత్
Logo




కామారెడ్డి కలెక్టరేట్ లో సివిల్ సప్లై కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు

News

Posted on 2026-01-24 17:00:25

Share: Share


కామారెడ్డి కలెక్టరేట్ లో సివిల్ సప్లై కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: కామారెడ్డిలోని సమీకృత కార్యాలయాల భవనంలో ఏసీబీ సోదాలు సంచలనం సృష్టించాయి. కలెక్టరేట్​లోని సివిల్ సప్లయ్​ కార్యాలయంలో  ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్  ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9:30 గంటలకు కలెక్టరేట్​కు చేరుకున్న ఏసీబీ అధికారులు సాధారణ వ్యక్తుల మాదిరిగా కలెక్టరేట్ మొత్తం కలియ తిరిగినట్టుగా తెలుస్తోంది. అనంతరం గంట తర్వాత సివిల్ సప్లయ్స్​​ కార్యాలయంలోకి వెళ్లి సిబ్బంది ఫోన్లు తీసుకుని సోదాలు ప్రారంభించినట్టుగా సమాచారం. కార్యాలయ సిబ్బంది ఎవరు ఏ విధులు నిర్వర్తిస్తారు అనే వివరాలు తీసుకుని కార్యాలయంలోని రికార్డులు తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచి ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఆకస్మికంగా ఏసీబీ సోదాలు జరగడం కలకలం రేపింది. ఈ తనిఖీల్లో భాగంగానే సోదాలు సర్వసాధారణంగా  చేపడుతున్నారా..? లేక ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేశారా... అనే విషయం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >