| Daily భారత్
Logo




దేశ భవిష్యత్తుకు పునాది బాలికలు

News

Posted on 2026-01-24 17:42:44

Share: Share


దేశ భవిష్యత్తుకు పునాది బాలికలు

బాలికల చదువు కోసం వారి అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది

నిజామాబాద్ అర్బన్ ధన్ పాల్  సూర్యనారాయణ వెల్లడి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: దేశ అభివృద్ధికి పునాది బాలికలని, బాలికల చదువు కోసం వారి అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ  పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో ఉమెన్, చిల్డ్రన్, డిజబుల్డ్, సీనియర్ సిటిజన్ శాఖ వారి ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలపై దాడులు లేని సమాజాన్ని సాధించుకుందామని.. వారికి ఉన్న హక్కులను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఆడపిల్లలను సంరక్షించుకుందాం వారికి మంచి జీవితాలను ఇద్దామని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. బాలికలు అంటే భవిష్యత్ తరాలకు పునాది అని ఆయన అన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం బేటి బచావో బేటి పడావో పథకం ద్వారా బాలికల సంరక్షణ, విద్యకు పెద్దపీట వేస్తుందని అలాగే బాలికల భవిష్యత్తు భద్రత కోసం సుకన్య సమృద్ధి యోజన, పోషకాహారం కోసం పీఎం పోషణ్ పథకం, గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్య కోసం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు మరియు పదోతరగతి తర్వాత చదువు కొనసాగించేందుకు జాతీయ బాలికల విద్య ప్రోత్సాహక పథకం వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని వాటిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన సూచించారు. బాలికలు చదువుకుంటే ఒక కుటుంబమే కాదని ఒక తరానికి మార్గం నిర్దేశకం అవుతారని ఆయన అన్నారు. దయచేసి బాలికల తల్లిదండ్రులు వారి చదువుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరిని చదివించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అప్పుడే ప్రతి ఒక్కరు అభివృద్ధి పతానా నడుస్తారని ఆయన అన్నారు.


ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ పద్మ లత, డిస్ట్రిక్ట్  వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ బి, డిస్టిక్ స్పోర్ట్స్ ఆఫీసర్ పవన్ కుమార్, సిడిపిఓలు సౌందర్య, పద్మ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >