Posted on 2026-01-24 20:16:28
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో రాబోయే రంజాన్ 2026 పండుగ ఏర్పాట్లు పై జిల్లా అదనపు కలెక్టర్ కె.శ్రీనివాస్ బుధవారం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసం మరియు ప్రార్థనలు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకోవడానికి అవసరమైన సౌకర్యాలను, పారిశుధ్యం, తాగునీరు, లైటింగ్, భద్రత, మసీదులు మరియు ప్రజా ప్రదేశాలలో సౌకర్యాలు వంటి తగిన మౌలిక సదుపాయాల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు. మత పెద్దలు విద్యుత్ సదుపాయము, స్ట్రీట్ లైట్స్, మంచి నీటి సదుపాయము, మరియు వీధి కుక్కలను నియంత్రిచుట లాంటి సమస్యలను పరిష్కారించాలని అదనపు కలెక్టర్ ను కోరారు.అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను మత పెద్దలు సూచించిన పలు అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నవీన్ రెడ్డి, సైబరాబాద్ ఫ్యూచర్ సిటీ డిసిపి, ఆర్డీఓ సరిత, పోలీసు అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, సంబంధిత అధికారులు, మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
పదవ తరగతి ఫలితాలలో మండలంలో మొదటి స్థానంలో నిలిచిన మన్విత కి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సన్మానం
Posted On 2026-05-04 15:31:43
Readmore >
మహిళా కానిస్టేబుల్‌ను అవమానించిన నాగరాజుపై షాద్‌నగర్ పోలీసుల యాక్షన్
Posted On 2026-05-04 09:57:57
Readmore >