Posted on 2026-01-25 18:01:55
సిపిఐ(ఎం), బిఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు కుదిరింది.
వైరా మున్సిపాలిటీలో కలిసి పోటీ చేయనున్న సిపిఐ(ఎం), బిఆర్ఎస్ పార్టీలు
డైలీ భారత్, వైరా: వైరా మున్సిపాలిటీ ఎన్నికల గురించి గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. త్వరలో జరగనున్న వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో బిఆర్ఎస్, సిపిఐ(ఎం) పార్టీల పొత్తు ఖరారైంది. రానున్న మున్సిపాలిటీ ఎన్నికలలో వైరా మున్సిపాలిటీలో సిపిఐ(ఎం), బిఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఆదివారం జరిగిన చర్చల్లో సిపిఐ(ఎం), బిఆర్ఎస్ పార్టీల మధ్య ఈ మేరకు అవగాహన కుదిరింది. ఆదివారం స్థానిక బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో సిపిఐ(ఎం), బిఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, పట్టణ నాయకులు బొంతు సమత, కొంగర సుధాకర్, బిఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జునరావు, వనమా విశ్వేశ్వరరావు, మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు మద్దెల రవి ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో వైరా మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో బిఆర్ఎస్, సిపిఐ(ఎం) పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ(ఎం), బిఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా ఐక్యంగా సైనికుల్లా పనిచేసి విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సిపిఐ(ఎం), బిఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు కుదరడంతో రానున్న వైరా మున్సిపాలిటీ ఎన్నికలు పోటాపోటీగా జరగనున్నాయి. ఈ సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు మాదినేని దుర్గాప్రసాద్, కొత్త వెంకటేశ్వరరావు, ఏదునూరి శ్రీను, దొంతబోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >