| Daily భారత్
Logo




స్వర్గీయ జర్నలిస్ట్ మల్లెపూల నరేంద్రను ఈ సమాజం ఎప్పటికీ మరువదు

News

Posted on 2026-01-25 17:59:21

Share: Share


స్వర్గీయ జర్నలిస్ట్ మల్లెపూల నరేంద్రను ఈ సమాజం ఎప్పటికీ మరువదు

ఉర్దూ అకాడమి చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన స్వర్గీయ జర్నలిస్ట్ మల్లెపూల నరేంద్రను ఈ సమాజం ఎప్పటికి మరువదని ఉర్దూ అకాడమి చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు. జర్నలిస్ట్ మల్లెపూల నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో మల్లెపూల నరేంద్ర 35వ వర్ధంతి సందర్భంగా ఆదివారం స్థానిక పాలిటెక్నిక్ మైదానంలో జర్నలిస్ట్లకు ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను మహిళ ఎడ్యుకేషన్ కళాశాల ప్రెసిడెంట్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ఎం రాజేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తాహెర్ మాట్లాడుతూ ఈనాడు గ్రామీణ విలేకరిగా పనిచేస్తూ తన విధి నిర్వహణలో అమరుడైన నరేంద్ర జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న కార్యాక్రమాలు పది మందికి చిరకాలంగా గుర్తుండి పోయే విధంగా నరేంద్ర విషయాన్ని ఈ సమాజం, ఈ జిల్లా ఎప్పుడు గుర్తుంచుకుంటుందన్నారు. గత 35 సంవత్సరాలుగా నరేంద్ర స్మారకార్థం క్రీడా పోటీలు నిర్వహించటం ఎంతో గొప్ప విషయమని, ఇది ఒక రికార్డు అని పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాల పాటు స్మారక పోటీలు ఎవరూ నిర్వహించలేరని, ఇది నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటి నిర్వాహకులకు

స్థానిక జర్నలిస్టులకు సాధ్యమయ్యిందని, ఈ సందర్భంగా నిర్వాహకులను, జర్నలిస్టులను తాహెర్ అభినందించారు. నిజామాబాద్ మహిళ ఎడ్యుకేషన్ కళాశాల ప్రెసిడెంట్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ఎం రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టు మల్లెపూల నరేంద్ర స్మారకార్ధం గత 35 సంవత్సరాలుగా నిర్వహిస్తున క్రీడా పోటీలలో జర్నలిస్టుల చొరవ ఎంతో అభినందీయమన్నారు. ఎవరైన చనిపోతే ఒకటి లేదా రెండు సంవత్సరాల పాటు వారిని గుర్తుంచుకుని ఎదైనా కార్యక్రమాలు చేస్తారు కానీ, జర్నలిస్టు నరేంద్ర మృతి చెంది 35 సంవత్సరాలు అవుతున్న ఇంకా ఆయనను గుర్తుంచుకుని ఇటువంటి కార్యక్రమాలు చేయటం హర్షించదగ విషయమన్నారు. ఈ సందర్బంగా నిర్వాహకులను, నరేంద్ర కుటుంబ

సభ్యులను, జర్నలిస్టులను ఆయన అభినందించారు.

నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటి చైర్మన్ డి సాయిలు మాట్లాడుతూ నరేంద్ర మృతి చెంది 35 సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుంచి నిరాటకంగా, నిర్వీరంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత 35 సంవత్సరాలుగా నరేంద్రను స్మరించుకుంటూ జర్నలిస్ట్లకు క్రికెట్, షటిల్, క్యారం పోటీలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఖోఖో పోటీలు రెండురోజుల పాటు నిర్వహించామన్నారు. నరేంద్ర 1989లో ఈనాడు గ్రామీణ విలేకరిగా చేరి 1991 జనవరి 29న విధి నిర్వహణలో ఆకస్మిక మృతి చెందారు. అప్పటినుంచి ప్రజాప్రతినిధులు, జర్నలిస్టుల సహకారంతో పోటీలు నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. ఈ పోటీలకు అన్ని విధాల సహకారాలు అందిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. వచ్చే సంవత్సరం నరేంద్ర స్మారకార్ధంగా మొదట్లో ఎలా పోటీలు నిర్వహించామో పూర్తిస్థాయిలో కమిటీలు వేసి అదే విధంగా పోటీలు నిర్వహిస్తామన్నారు.

నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పంచరెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ స్వర్గీయ మల్లెపూల నరేంద్ర మెమోరియల్ ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి సందర్బంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీలు జర్నలిస్టులకు ఎంతో స్పూర్తినిస్తున్నాయని

తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నరేంద్ర యాదిలో 35 సంవత్సరాలుగా క్రీడా పోటీలు నిర్వహించటం ఎంతో గొప్ప విషయమన్నారు. ఈ క్రీడాపోటీలు తమ జర్నలిస్టులలో ఐక్యతను నిరూపిస్తోందన్నారు. నరేంద్రను యాది చేస్తూ రానున్న పోటీలు స్కూల్ పిల్లలకు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ కన్వీనర్ మల్లెపూల నర్సయ్య, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వాగ్మేరే సుభాష్, కోశాధికారి రాజ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బొచ్చ రాజు, ఐజేయూ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్, ప్రధాన కార్యదర్శి అరవింద్ బాలాజీ, ఎటాక్స్ కమిటి చైర్మన్ బొబ్బిలి నర్సయ్య, మీసాల సుధాకర్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లలు, కెమోరామెన్లు పాల్గొన్నారు.

సుభాష్ జట్టు గెలుపు...

జర్నలిస్టు నరేంద్ర స్మారక పోటీలలో భాగంగా ఆదివారం జరిగిన క్రికెట్ పోటిలలో పంచరెడ్డి శ్రీకాంత్ ఎలెవన్ జట్టుపై సుభాష్ ఎలెవన్ జట్టు మూడు పరుగల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన సుభాష్ జట్టు నిర్ణీత 16 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. ఇందులో శ్యామ్ 41 పరుగులు, రవికాంత్ 34 పరుగులు చేశారు. ఇక 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంచరెడ్డి శ్రీకాంత్ జట్టు 16 ఓవర్లతో 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులు  చేసి మూడు పరుగుల తేడాతో ఓటమి చెందింది.

Image 1

రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-04 21:45:49

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు

Posted On 2026-05-04 21:41:50

Readmore >
Image 1

పానిహాటిలో ఆర్‌.జి. కర్ బాధితురాలి తల్లి "విజయ" గర్జన!

Posted On 2026-05-04 20:24:36

Readmore >
Image 1

"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"

Posted On 2026-05-04 20:16:49

Readmore >
Image 1

కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు

Posted On 2026-05-04 20:10:55

Readmore >
Image 1

దమ్మపేట బిజెపి శ్రేణుల సంబరాలు

Posted On 2026-05-04 19:56:57

Readmore >
Image 1

సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-04 19:51:36

Readmore >
Image 1

కామారెడ్డి డిఎస్పిగా యస్. మధుసూదన్ బాధ్యతల స్వీకరణ

Posted On 2026-05-04 19:01:07

Readmore >
Image 1

హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..

Posted On 2026-05-04 18:53:54

Readmore >
Image 1

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, 5000 రూపాయల జరిమానా

Posted On 2026-05-04 18:51:37

Readmore >