Posted on 2026-01-25 17:24:30
ఈసారి ఆ తప్పిదం చేసేది లేదు.. గెలుపు గుర్రాలకే టికెట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రతిష్టాత్మకం
టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మున్సిపల్ జిల్లా ఎన్నికల ఇన్చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్ఠీకరణ
డైలీ బారత్ న్యూస్, నిజామాబాద్: గత మున్సిపల్, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలలో కొన్ని పొరపాట్ల వల్లే ఓడిపోవడం జరిగిందని, ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున ఈ మున్సిపల్ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచే అభ్యర్థులకే టికెట్లు అందివ్వనున్నట్లు జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లు స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, జిల్లా నేతలు ఏర్పాటుచేసిన మున్సిపల్ ఎన్నికల సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టిపిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారితో పాటు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డిలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండని,
రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలను నెక్స్ట్ లెవెల్ లో అభివృద్ధి చేస్తామన్నారు. కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం మనకు గేమ్ చెంజర్ లాంటివి అని అన్నారు. దీనివల్ల 85 శాతం మందికి లబ్ది చేకురనుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో మరో మూడేళ్లు స్థిరమైన ప్రభుత్వం ఉంటుందని రాబోయే ప్రభుత్వం కూడా మనదేఅని అన్నారు.
నిజామాబాద్ లో గత ఎన్నికల్లో మన పనితీరు బాగాలేదని, దయచేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పార్టీ గెలుపులో తమదైన పాత్ర వహించాలని కోరారు. అంతకుముందు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఈసారి జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నిజమాబాద్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం అని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాల కోసమే.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ కు మున్సిపల్ ఎన్నికల ఇంచార్జీ బాధ్యతలు అప్ప చెప్పారని అన్నారు. సర్వేల ఆధారంగా నే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
హిందూ పేరుతో.. అరవింద్ ఎంపీ అయ్యారని, దేవుళ్ళ పేరుతో ఓట్లు అడిగే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కాదన్నారు. దేవుడు పేరు తో ఓట్లు అడిగే వారు వారు గెలిచాక అభివృద్ధి చేయరని ఆయన అన్నారు. కాంగ్రెస్ బీజేపీ కి ఎంత దూరమో మజ్లిస్ కు అంతే దూరమని స్పష్టం చేశారు.
బీజేపీ నేతలు అబద్ధాన్ని ప్రచారం చేసి, ఇంటింటికి విషం నింపుతున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్స్ కోసం తొందర వద్దని, ప్రలోభాలతో టికెట్స్ రావని, కార్పొరేటర్, కౌన్సిలర్ సీట్ల కోసం డబ్బులు ఎవరికి ఇవ్వొద్దన్నారు. కులం ,మతం పేరిట ప్రజల జీవితాలు విచ్చిన్నం చేస్తానంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >