Posted on 2026-01-26 17:14:15
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ లోని ఆర్యవైశ్య పట్టణ సంఘంలో గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం లెట్స్ ఆరంబ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొని మాట్లాడారు. ఇలాంటి ఉన్నత చదువులు చదువుకున్న ఆర్యవైశ్యులు సంఘ సేవా కార్యక్రమాల్లో సహాయం అందించేందుకు ముందుండాలని ఆయన అన్నారు. అలాగే పేద ఆర్యవైశ్యుల వ్యాపారం పరంగా మెలకువలు రాణించడానికి ఈ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ సభ్యులు ఆర్థికపరంగా ముందుకు రావడం అభినందనీయం అన్నారు. ఆర్యవైశ్యులు సమాజంలో అంటేనే సేవ మానవత్వానికి ప్రతీకలని ఆయన అన్నారు. అందుకే పేద ఆర్యవైశ్యులను వ్యాపారాలు చేయడానికి ముందుకు వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా తన ట్రస్టు ద్వారా కూడా ఆర్యవైశ్యులకు వ్యాపారం నిమిత్తం ఆదుకునేందుకు సహా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. అలాగే ఉద్యోగాలతో పాటు వ్యాపారాలలో రాణించాలని ఉత్సాహం ఉన్న యువతకు అసోసియేషన్ ఆధ్వర్యంలో దరఖాస్తులు చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు . ఆర్యవైశ్య గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కుట్ల నవీన్, కార్యదర్శి గందె శ్రీనివాస్ , కోశాధికారి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >