Posted on 2026-01-27 02:18:53
ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార పార్టీ నేతలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:రాష్ట్రంలో బల్దియా ఎన్నికల నేపథ్యంలో జిల్లాల పర్యటన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా పర్యటన ఖరారు అయింది. ఫిబ్రవరి 6న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి రానున్నారని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డిలు తెలిపారు. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభనిర్వహించేందుకు నిజామాబాద్ రూరల్ మండలం కేశపూర్ గ్రామ శివారులోని ప్రైవేట్ స్థలాన్ని సోమవారం పరిశీలించారు. ఈ నెల 27,28న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో మరి కొన్ని రోజుల్లో రానుండటంతో ముఖ్యమంత్రి జిల్లా పర్యటన దాదాపు ఖాయమైనట్లు అధికార పార్టీ నాయకులు ఆ పనుల్లో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇది వరకు జిల్లాల పర్యటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు రాకపోవడంతో బల్దియా ఎన్నికల ప్రచారం కోసం రప్పిస్తున్నట్లు సమాచారం.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >