Posted on 2026-01-27 17:50:03
నామినేషన్ స్వీకరణ జనవరి 28 వ తేదీ నుండి జనవరి 30వ తేదీ వరకు
మునిసిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు రెండవ సాధారణ ఎన్నికలు – 2026
డైలీ భారత్, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లకు సాధారణ ఎన్నికలు–2026 నిర్వహించేందుకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, SP లు, సంబంధిత అధికారులతో ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఇంచార్జీ కలెక్టర్ ఇలా త్రిపాఠి, కామారెడ్డి ACLB మధుమోహన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, మున్సిపల్ కమిషనర్ లు నిజామాబాద్ కలెక్టరేట్ నుండి హాజరుకాగా, కామారెడ్డి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ వీణ, జెడ్పీ సీఈఓ చందర్ , సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఈ మేరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) తక్షణమే అమల్లోకి వచ్చినట్లు తెలియజేయడమైనది.
ఎన్నికల షెడ్యూల్ ముఖ్యాంశాలు:
నామినేషన్ల స్వీకరణ ప్రారంభ తేదీ: 28.01.2026 (బుధవారం)
(ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు)
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: 30.01.2026 (శుక్రవారం)
(సాయంత్రం 5.00 గంటల వరకు)
నామినేషన్ల పరిశీలన తేదీ: 31.01.2026* (శనివారం)
(ఉదయం 11.00 గంటల నుండి)
చెల్లుబాటు అయ్యే అభ్యర్థుల జాబితా ప్రచురణ: 31.01.2026 (శనివారం)
(పరిశీలన పూర్తయిన వెంటనే)
అప్పీల్ దాఖలు చేసుకునే చివరి తేదీ: 01.02.2026 (ఆదివారం)
(సాయంత్రం 5.00 గంటల వరకు)
అప్పీల్స్ పరిష్కార తేదీ: 02.02.2026 ( సోమవారం)
(సాయంత్రం 5.00 గంటలకు ముందు)
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ: 03.02.2026 ( మంగళవారం)
(మధ్యాహ్నం 3.00 గంటల వరకు)
తుది అభ్యర్థుల జాబితా ప్రచురణ: 03.02.2026 (మంగళవారం)
(మధ్యాహ్నం 3.00 గంటల తర్వాత)
పోలింగ్ తేదీ: 11.02.2026 (బుధవారం)
(ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు)
రీ-పోల్ (ఉండినట్లయితే): 12.02.2026 (గురువారం)
ఓట్ల లెక్కింపు తేదీ: 13.02.2026 (శుక్రవారం)
(ఉదయం 8.00 గంటల నుండి)
ఫలితాల ప్రకటన: ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే
ఎన్నికల ప్రక్రియ మొత్తం నిబంధనల ప్రకారం ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, అధికారులు , ప్రజలు సంపూర్ణ సహకారం అందించి ఎన్నికలను పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని అన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సంబంధిత మున్సిపాలిటీలకు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) తక్షణమే అమల్లోకి వచ్చింది.
ఎంసీసీ అమలులో ఉన్న కాలంలో ఎలాంటి ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలకు తావు లేకుండా, అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు అధికారులు ఎన్నికల నియమాలను కచ్చితంగా పాటించాలని, అదేవిధంగా, పట్టణ పరిధిలో ఉన్న అన్ని రాజకీయ బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, ఫోటోలు, ఇతర అభ్యంతరకరమైన ప్రచార సామగ్రిని వెంటనే తొలగించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశించనైనది.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >