Posted on 2026-01-28 20:10:11
ఆర్మూర్ మున్సిపల్ రిటర్నింగ్ అధికారిని విధుల పట్ల నిర్లక్ష్యం
విధులకు డుమ్మా కొట్టిన ఆర్మూర్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సస్పెన్షన్
ఉత్తర్వులు జారీచేసిన జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్ : ఎన్నికల విధులకు గైర్హాజరైన ఆర్మూర్ బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనజారెడ్డి సస్పెన్షన్‌కు గురయ్యారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆర్మూర్‌లోని 4, 5, 6 వార్డుల ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో)గా ప్రధానోపాధ్యాయురాలు వనజా రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అయితే ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎన్నికల విధులకు గైర్హాజరయ్యారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి దృష్టికి వచ్చింది. దీంతో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ ప్రధానోపాధ్యాయురాలు వనజారెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు హెచ్ఎం వనజా రెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ ఉత్తర్వులు జారీ చేశారు.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >