| Daily భారత్
Logo




మేడారం: జాతర కీలక ఘట్టం ఆవిష్కృతం

News

Posted on 2026-01-29 08:23:51

Share: Share


మేడారం: జాతర కీలక ఘట్టం ఆవిష్కృతం

కన్నెపల్లి నుంచి గద్దెపైకి కొలువు తీరిన సారలమ్మ

కన్నెపల్లి లో మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ప్రత్యేక పూజలు

డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్:తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో అత్యంత కీలక ఘట్టం బుధవారం భక్తి పరవశ్య వాతావరణంలో ఆవిష్కృతమైంది. కోట్లాది భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఘడియ సాయంత్రం ప్రారంభమవగా, కన్నెపల్లి నుంచి గద్దెపైకి శ్రీ సారలమ్మ కొలువు తీరడం జాతరలో తొలి ప్రధాన ఘట్టంగా నిలిచింది.

ఈ ఘట్టానికి ముందుగా పూజారులు, జిల్లా యంత్రాంగం కన్నెపల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమ్మక్క దేవతల పూజారులు సిద్ధబోయిన వారి ఇంటికి చేరి సంప్రదాయ కార్యక్రమాలు చేపట్టగా, కొండాయి గ్రామం నుంచి గోవిందరాజుల దేవతను కన్నెపల్లికి తీసుకువచ్చారు. అనంతరం శ్రీ సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య,పూజారులు కాక వెంకటేశ్వర్లు, కాక కిరణ్ కుమార్, కాక కనకమ్మ, కాక భుజంగరావు, కాక లక్ష్మీబాయి లతో పాటు గోవిందరాజుల పూజారి దుబ్బకట్ల గోవర్ధన్‌లు కలిసి ఆదివాసీ ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దాదాపు రెండు గంటల పాటు కన్నెపల్లి సారలమ్మ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సుమారు సాయంత్రం 7, గంటలకు సారలమ్మ అమ్మవారు కన్నెపల్లి నుంచి బయలుదేరారు. జంపన్న వాగు మీదుగా మేడారం గ్రామానికి చేరుకున్న సందర్భంగా పూనకాలతో తన్మయత్వానికి లోనైన భక్తులు, డప్పు వాయిద్యాల నడుమ దారి పొడవునా అమ్మవారికి ఘన స్వాగతం పలికారు. ఈ ఘట్టంతో మేడారం పరిసరాలు భక్తి పరవశ్యంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

రాత్రి 12.30 గంటలకు గద్దెల ప్రాంతానికి చేరుకున్న సారలమ్మ అమ్మవారికి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోవిందరాజులు, పగిడిద్దారాజులతో కలిసి అర్ధరాత్రి గద్దెపైకి అమ్మవారు చేరుకున్నారు. ప్రధాన పూజారి సారయ్య అమ్మవారిని గద్దెలపైకి తీసుకొచ్చి కొలువు తీర్చారు.

ఈ ఘట్టానికి ముందు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్‌లు శ్రీ సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కన్నెపల్లి గ్రామస్తులతో కలిసి ఆదివాసీ గిరిజన సంప్రదాయా నృత్యాల్లో పాల్గొని జాతర ఆధ్యాత్మికతను మరింత పెంచారు.

దీంతో మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో తొలి కీలక ఘట్టం విజయవంతంగా పూర్తికాగా, కొంగుబంగారు తల్లి శ్రీ సారలమ్మ గద్దెపై కొలువు తీరుతూ భక్తులకు దీవెనలు ఇస్తోంది. ఇక జాతరలోని తదుపరి ఘట్టాల కోసం భక్తజనం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >