Posted on 2026-01-29 11:20:10
తెలంగాణ టీచర్స్ యూనియన్(TTU) రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ
డైలీ భారత్, సిరిసిల్ల: ఆసియా ఖండంలోనే వైభవంగా జరిగే గొప్ప జాతర, తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క సారక్క జాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 30,31తేదీలలో సాధారణ సెలవులు ప్రకటించాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కొండికొప్పుల రవి , దూస మధులు తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు..తెలంగాణలోని సబ్బండ వర్గాలు ఘనంగా జరుపుకునే ఈ జాతర కు తెలంగాణతో పాటు ఒరిస్సా, చత్తీస్గడ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుండి కూడా ప్రజలు తరలివస్తారని ,సమ్మక్క సారక్కల మొక్కులు చెల్లించుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులకు, పాఠశాల,కళాశాలల విద్యార్థులకు సాధారణ సెలవులు ప్రకటించాలని కోరారు. రెండు సంవత్సరాలకు ఒకసారి ఘనంగా జరిగే ఈ జాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా నిర్వహించడం ఆనందదాయకం అని తెలిపారు.ఈ జాతరకు సెలవులు ప్రకటిస్తూ మేడారం జాతరని జాతీయ పండుగగా ప్రకటించాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
సమ్మక్క సారక్కల పోరాట స్ఫూర్తితో తెలంగాణ సమాజం జాగృతం కావాలని తెలుపుతూ ఆ తల్లులకు వినమ్ర వందనాలు తెలిపారు.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >