Posted on 2026-01-29 14:03:51
డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. నందినగర్‌లోని కేసీఆర్ నివాస సిబ్బందికి నోటీసులు అందజేసింది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు కేసీఆర్‌ను ప్రశ్నించనున్నట్లు సిట్ అధికారులు తెలిపారు.
గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు వేగం పెంచారు. ఈ కేసు విచారణలో భాగంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు వెళ్లి.. ఆయన ఇంట్లో లేనందున అక్కడి సిబ్బందికి నోటీసులు అందజేశారు. సెక్షన్ సీఆర్పీసీ 160 కింద ఈ నోటీసులు కేసీఆర్‌కు జారీ చేశారు. రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్‌ను ప్రశ్నించనున్నట్లు సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్నారు.
మరోవైపు కేసీఆర్ విచారణకు సంబంధించి సిట్ కార్యాలయంలో అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ విచారణలో అడగాల్సిన ప్రశ్నల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ విచారణ ప్రక్రియను ఎక్కడ నిర్వహించాలి(ఆయన నివాసంలోనా? లేదా సిట్ ఆఫీసులోనా?) అనే అంశాలపై అధికారులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. భద్రతా పరమైన చర్యలు, చట్టపరమైన నిబంధనలపై సిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >