Posted on 2026-01-29 18:37:04
ప్రయాణికులు ప్రజల కనీస అవసరాన్ని తీర్చండి. భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ మండల అధికారులకు ప్రజాప్రతినిధులకు డిమాండ్.
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుమండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్ నాయక్ మాట్లాడుతూ మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు నిత్యం ప్రభుత్వ కార్యాలకు వ్యాపార సముదాయాలకు అనేక పనులపై వస్తూ ఉంటారని వారి కనీస అవసరాలకు పబ్లిక్ టాయిలెట్స్ లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. దూర ప్రాణికుల కొరకు బస్సు కొరకు వేచి చూసే ప్రయాణికులు మహిళలు వృద్ధులు, చిన్న పిల్లలు పబ్లిక్ టాయిలెట్స్ లేక ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రం మొత్తం వ్యాపార సముదాయాలకు రద్దీగా ఉంటుందని దీంతో ప్రజలు కనీసం అవసరమైన టాయిలెట్ కొరకు అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు మండల కేంద్రంలో పబ్లిక్ టాలెంట్ నిర్మిస్తే ప్రయాణికులకు ప్రజలకు ఇబ్బందులు ఉండవని జూలూరుపాడు మండల కేంద్రంలో పబ్లిక్ టాలెంట్ నిర్మించే లాగా కృషి చేయాలని ఆయన కోరారు. మండల ప్రధాన సెంటర్లో బస్ షెల్టర్ లేక ప్రయాణికులు ఎండలో వర్షంలో నిలబడి ఉండాల్సి వస్తుందని ఖమ్మం వైపు భద్రాచలం వైపుకు బస్ కొరకు ఎదురు చూసే సమయంలో బస్ షెల్టర్ లేక ఎండకు ఎండుతున్నారని వర్షానికి తడుస్తూ బస్సుల కోసం నిలబడి చూడాల్సి వస్తుందని ఆయన వివరించారు. బస్ షెల్టర్ నిర్మిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తక్షణమే మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్ బస్సు షెల్టర్ నిర్మించడానికి అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆయన కోరారు.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >