Posted on 2026-01-29 18:44:25
డైలీ భారత్, అనకాపల్లి: అనకాపల్లి ఉత్సవ్ (తేదీ:30,31.01.2026) పురస్కరించుకుని జిల్లాలో నిర్వహించే వివిధ కార్యక్రమాలకు సంబంధించి పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ తెలిపారు. ఉత్సవాలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.శ్రావణి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం మరియు బెల్లం మార్కెట్ ప్రాంతాలను, పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ వి.విష్ణు స్వరూప్ ఆధ్వర్యంలో ముత్యాలమ్మ పాలెం బీచ్, కొండకర్ల ఆవ ప్రాంతాల్లో బందోబస్తును పర్యవేక్షిస్తారు.
వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మరియు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు.
ఉత్సవ ప్రాంతాల్లో కదలికలను గమనించేందుకు సీసీటీవీ కెమెరాలు మరియు డ్రోన్లతో నిరంతర నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.
ఎటువంటి నేరాలు, అల్లర్లు జరగకుండా నిరోధించేందుకు ఉత్సవ ప్రాంగణాల్లో భారీగా మఫ్టీలో పోలీసులను మోహరించారు.
బందోబస్తు విధుల్లో ఉన్న అధికారులు మరియు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విధులు నిర్వహించాలని ఎస్పీ స్పష్టం చేశారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించి, ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా పోలీస్ యంత్రాంగం కోరుతోంది.
#anakapallidistrict
#anakapallipolice
#AndhraPradeshStatePolice
#Andhra Pradesh Police
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >