Posted on 2026-01-30 14:41:09
ఆశీర్వదించండి అంటూ డివిజన్లో ఇంటింటికి తిరుగుతూ నామినేషన్ వేసిన బిజెపి కార్పొరేటర్ అభ్యర్థి చింత ప్రసూన శ్రీనివాస్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: సమాజ వికాసమే విశ్వాసం చేవె లక్ష్యంగా మూడవ డివిజన్ వాసుల కు సేవ చేయడానికి కార్పొరేటర్ గా మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి అంటూ బిజెపి అభ్యర్థి చింతా ప్రసూన శ్రీనివాస్ శుక్రవారం గూపన్పల్లి లో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రంలో ఆమె నామినేషన్ వేశారు. డివిజన్ మొత్తం సాంప్రదాయ బద్దంగా మేళ బాజ తో డివిజన్లో ఇంటింటికి తిరుగుతూ తమను ఆశీర్వదించాలంటూ చింత ప్రసూన శ్రీనివాస్ ప్రతి ఒక్కరికి తనకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఓ యువత మేలుకో చింత ప్రసూన శ్రీనివాస్ ని ఎన్నుకో ఇందూరుని ఏలుకో అనే నినాదంతో తన ప్రచారాన్ని సాగిస్తూ నామినేషన్ దాఖలు చేశారు. బిజెపి అధిష్టానం తనకు ఈసారి కచ్చితంగా బీఫామ్ అందిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తాను గెలిచాక అమ్మ కానుక పథకం కింద అప్పుడే పుట్టిన ప్రతి ఆడబిడ్డ కి ఐదువేల ఒక వంద 16 రూపాయలు నగదును అందజేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. అలాగే ప్రతి వీధిలో సీసీ కెమెరాల సదుపాయం, డ్రైనేజీ, రోడ్లు, నీటి సదుపాయం అందే విధంగా చూస్తానని అన్నారు. ముఖ్యంగా డివిజన్ వాసుల ఆశీర్వాదంతో తాను గెలిస్తే ప్రతి నెల డివిజన్ సమస్యలపై సమావేశం నిర్వహిస్తానని హామీ ఇచ్చారు అలాగే పార్కు డెవలప్మెంట్, అంబేద్కర్ భవన్, మహిళా సంఘ భవన నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. అర్హులైన వారందరికీ పింఛన్లు అందే విధంగా కృషి చేయడంతో పాటు పక్కా ఇల్లు, అర్హులకు లోన్ సదుపాయం, పారిశుద్ధ్యం పచ్చదనం తోపాటు హెల్త్ క్యాంప్ నిర్వహణ కచ్చితంగా నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు కావున డివిజన్ వాసులు ఈ ఒక్కసారి తనను ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >
ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"
Posted On 2026-06-30 13:21:42
Readmore >
ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య
Posted On 2026-06-30 08:20:14
Readmore >