Posted on 2026-01-31 18:33:33
ప్రమాద సమయంలో బస్సులోనే విద్యార్థులు.. తప్పిన పెను ప్రమాదం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నవీపేట్ మండలంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. స్టేషన్ ఏరియా సమీపంలో ఆదర్శ స్కూల్ బస్సులో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో దాదాపు 50 మంది విద్యార్థులు ఉండటంతో అందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూనే, విద్యార్థులందరినీ సురక్షితంగా బస్సు కిందకు దింపడంతో పెను ముప్పు తప్పింది. ఫిట్నెస్ లేని బస్సులను రోడ్లపైకి అనుమతించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా తేటతెల్లమవుతుంది. ఇదే విద్యాసంవత్సరంలో జిల్లాలో ఇలాంటి స్కూల్ బస్సుల ప్రమాదాల ఘటనలు తరచుగా ఎక్కడో ఓ చోట జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు సదరు పాఠశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్ర విమర్శలు. మరోపక్క విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >
ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"
Posted On 2026-06-30 13:21:42
Readmore >
ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య
Posted On 2026-06-30 08:20:14
Readmore >