Posted on 2026-02-01 08:30:58
*జిల్లాలో తీవ్ర విషాదం..*
గంజాయి మాఫియా చేతిలో తీవ్రంగా గాయపడి తొమ్మిది రోజులపాటు మృత్యువుతో పోరాడి తనువు చాలించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య
సౌమ్య మృతితో ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల్లో, ఆమె కుటుంబంలో అలుముకున్న విషాదఛాయలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గంజాయి మాఫియా అరాచకుల చేతిలో తీవ్రంగా గాయపడి తొమ్మిది రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య తనువు చాలించింది. దీంతో ఎక్సైజ్ జిల్లా శాఖతోపాటు ఆమె కుటుంబంలో తీరని విషాదఛాయలు అలుముకున్నాయి. ఎన్నో ఆశలతో ఉద్యోగం సంపాదించిన సౌమ్య ఆనతి కాలంలోనే విధి నిర్వహణలో భాగంగా గంజాయి మాఫియా చేతిలో మృతి చెందింది. నిజామాబాద్ నగర శివారులో 23 జనవరి రోజున సాయంత్రం 7.00 గంటలకు గంజాయి మాఫియా అరాచక శక్తుల దుశ్చర్యకు లోనై మూత్రపిండాలు , ప్లీహం, కాలేయం పోగొట్టుకుని కానిస్టేబుల్ గాజుల సౌమ్య హస్పిటల్ లో చావు బతుకుల మధ్య తొమ్మిది రోజులుగా మృత్యువుతో పోరాడి శనివారం రాత్రి 9.45 నిమిషాలకు తనువు చాలించింది. సౌమ్య తండ్రి గాజుల సాయిలు , తల్లి చంద్రకళ వారాంతపు సంతలో నిత్యావసర సరుకులు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. తమ్ముడు శ్రవణ్ డిగ్రీ పూర్తి చేసి పోలీసు పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు సౌమ్య కుటుంబీకులు తెలిపారు. గంజాయి, మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపడంలో కానిస్టేబుల్ సౌమ్య విధి నిర్వహణలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి తన ప్రాణాలను త్యాగం చేయడం ద్వారా ఎక్సైజ్ శాఖ ప్రతిష్ట పెంచిందని నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. సౌమ్య సాహసం అసమానమైనదని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం 9.00 గంటలకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు కానిస్టేబుల్ గాజుల సౌమ్య భౌతికకాయానికి నివాళులు అర్పించి, ప్రభుత్వం తరపున ప్రకటన చేయడానికి నిమ్స్ కు రావడం జరుగుతుందని సమాచారం.
ఎక్సైజ్ కానిస్టేబుల్ నుండి అడిషనల్ కమీషనర్ వరకు ఆదివారం ఉదయం 8.30 గంటలకు నిమ్స్ హాస్పిటల్ ప్రాంగణం వద్ద యూనిఫారం తో హాజరై సౌమ్య త్యాగానికి నివాళులు అర్పించడం జరుగుతుందని తెలంగాణ ఎక్సైజ్ అసోసియేషన్ జేఏసీ ఓ ప్రకటనలో తెలిపారు.
ఆమె అంత్యక్రియలు సౌమ్య స్వగ్రామం మోస్రా మండలంలో సాయంత్రం మూడు గంటలకు ప్రారంభమవుతాయని తెలుస్తుంది.
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >
ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"
Posted On 2026-06-30 13:21:42
Readmore >
ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య
Posted On 2026-06-30 08:20:14
Readmore >