| Daily భారత్
Logo




మేడారం జాతరపై తీవ్ర విమర్శలు

News

Posted on 2026-02-01 08:32:12

Share: Share


మేడారం జాతరపై తీవ్ర విమర్శలు

డైలీ భారత్ మేడారం: మేడారం జాతర నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతర ఏర్పాట్లలో లోపాలపై ప్రశ్నలు ఎదురవుతాయని ముందే అంచనా వేసిన మంత్రి సీతక్క మీడియాకు ముఖం చాటేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతర ముగిసిన అనంతరం జరగాల్సిన ప్రెస్‌మీట్‌ను ఆమె అకస్మాత్తుగా రద్దు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

భక్తులకు కనీస వసతులు కూడా సరిగా కల్పించలేదని జాతరకు వచ్చిన జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, రహదారులు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాల్లో తీవ్ర లోపాలు ఉన్నాయని విమర్శలు వినిపించాయి. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజలు బహిరంగంగానే దుమ్మెత్తి పోశారు.

మీడియా ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం లేకే మంత్రి సీతక్క ప్రెస్‌మీట్‌ను క్యాన్సిల్ చేశారని సీనియర్ జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. “జాతర విజయవంతమైందని ప్రభుత్వం భావిస్తే, మీడియా సమావేశాన్ని ఎందుకు రద్దు చేశారు?” అని వారు నిలదీస్తున్నారు.

రాష్ట్ర అధికారిక పండుగగా గుర్తింపు పొందినప్పటి నుంచి మేడారం జాతర ముగిసిన తరువాత మంత్రి మీడియా సమావేశం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అలాంటి సంప్రదాయాన్ని ఈసారి విస్మరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మొత్తం మీద మేడారం జాతర నిర్వహణపై ప్రభుత్వ వైఫల్యం మరోసారి బహిర్గతమైందని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >
Image 1

ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"

Posted On 2026-06-30 13:21:42

Readmore >
Image 1

చీరతో చేతులు కట్టేసి మరీ... భర్తను నరికి చంపిన భార్య...

Posted On 2026-06-30 08:55:26

Readmore >
Image 1

ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య

Posted On 2026-06-30 08:20:14

Readmore >