Posted on 2026-02-01 18:40:49
ఈ బడ్జెట్ వల్ల దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు చేకూరుతుంది
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఆదివారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలోని అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరుతుందని, ముఖ్యంగా పేద మరియు మధ్య తరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. రైతులకు, అలాగే రోజువారి పనులు చేసుకునే వారికి ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగదాయకమని ఆయన అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ తో దేశం మరికొన్ని రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ప్రపంచంలోనే అన్ని దేశాలకు మార్గదర్శకంగా నిలిచి ప్రపంచ దేశాల సరసన నిలబడడం ఖాయమన్నారు. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడుకి ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ఉపయోగం చేకూరుతుందని ఆయన అన్నారు. ఇప్పటివరకు ఏ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనలతో ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్ ను రూపొందించారని ఆయన కొనియాడారు. బడ్జెట్ పై ప్రతిపక్షాలు చేస్తున్న కల్పితాలను ప్రజలు నమ్మకూడదని ఈ బడ్జెట్ కేవలం దేశాభివృద్ధి కోసమేనని ఆయన స్పష్టం చేశారు.
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >
ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"
Posted On 2026-06-30 13:21:42
Readmore >
ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య
Posted On 2026-06-30 08:20:14
Readmore >