| Daily భారత్
Logo




ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి పట్ల సంతాపం తెలిపిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

News

Posted on 2026-02-01 18:42:03

Share: Share


ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి పట్ల సంతాపం తెలిపిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

నిషేధిత గంజాయి పై అధికారులు, ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇటీవల విధి నిర్వహణలో భాగంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య పై గంజాయి అరాచక ముఠా జరిపిన దాడిలో తొమ్మిది రోజులపాటు చావు బతుకులతో పోరాడుతూ శనివారం రాత్రి తుదిత్వాస విడిచిన ఆమెకు సంతాపం తెలుపుతూ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిషేధిత గంజాయి ఏరివేత కోసం తను నిర్వహిస్తున్న విధుల్లో భాగంగా  ఆమెను తీవ్రంగా దాడి చేయడాన్ని బిజెపి పార్టీ తరఫున తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అర్బన్ నియోజకవర్గం గంజాయి రహిత జిల్లాగా ఉండేటట్లు ఎక్సైజ్ అధికారులు ఇకపై గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదించి ఎన్నో కలలు కన్న కానిస్టేబుల్ సౌమ్య తొమ్మిది రోజులపాటు చావు బతుకులతో పోరాడి శనివారం రాత్రి మరణించారనే వార్త తనకు ఎంతో బాధ కలిగించిందని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి వహించాలని ఎమ్మెల్యే  పేర్కొన్నారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థికంగా ఎక్స్గ్రేషియా ప్రకటించాలని అన్నారు. అలాగే ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >
Image 1

ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"

Posted On 2026-06-30 13:21:42

Readmore >
Image 1

చీరతో చేతులు కట్టేసి మరీ... భర్తను నరికి చంపిన భార్య...

Posted On 2026-06-30 08:55:26

Readmore >
Image 1

ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య

Posted On 2026-06-30 08:20:14

Readmore >