| Daily భారత్
Logo




కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణకు పెద్దపీట

News

Posted on 2026-02-01 22:26:49

Share: Share


కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణకు పెద్దపీట

డాక్టర్ పైడి ఎల్లారెడ్డి గారు రాష్ట్ర నాయకులు!

డైలీ భారత్, కామారెడ్డి:  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా కేంద్ర బడ్జెట్  , వేల కోట్ల నిధులతోనే తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ బడ్జెట్ స్పష్టంగా చాటిచెప్పింది.

దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా ఉన్న హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పం ఈ బడ్జెట్‌లో కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఆరోపణలు చేస్తూ కాలం వృథా చేస్తే, కేంద్ర ప్రభుత్వం మాత్రం అభివృద్ధికి అవసరమైన నిధులు, విధానాలు, అవకాశాలు అందిస్తోంది.

అర్బన్ ఛాలెంజ్ ఫండ్ – మాటల కాదు, మెట్రోకు నిధులు

పట్టణాభివృద్ధి కోసం ప్రకటించిన ₹1 లక్ష కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద హైదరాబాద్‌కు కీలక అవకాశాలు కల్పించారు.

ఈ ఫండ్ ద్వారా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 (Phase IIA & IIB) విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

ట్రాఫిక్ సమస్యలపై రాజకీయాలు చేసినవారు, ఇప్పుడు కేంద్రం ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోవడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి.

RRR దక్షిణ భాగానికి లైన్ క్లియర్ – అభివృద్ధికి అడ్డంకి ఎవరు?

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న రీజినల్ రింగ్ రోడ్ (RRR) దక్షిణ భాగానికి లైన్ క్లియర్ చేయడం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాత్మకతకు నిదర్శనం.

ఈ ప్రాజెక్ట్ ద్వారా

– హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు సమగ్ర అభివృద్ధి

– పరిశ్రమల వికేంద్రీకరణ

– రైతులకు భూముల విలువ పెరుగుదల

– యువతకు ఉద్యోగ అవకాశాలు సాధ్యమవుతాయి.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ, అనుమతుల పేరుతో అడ్డంకులు పెట్టడం మానుకోవాలి.

₹40 వేల కోట్ల సెమీకండక్టర్ మిషన్ 2.0 – హైదరాబాద్‌కు హైటెక్ భవిష్యత్

సెమీకండక్టర్ మిషన్ 2.0 కోసం ₹40 వేల కోట్లు కేటాయించడం ద్వారా హైదరాబాద్‌ను హైటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చే దిశగా కేంద్రం పెద్ద అడుగు వేసింది.

కేంద్రం అవకాశాలు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పరిశ్రమలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించడంలో విఫలమవుతోంది.

బయోఫార్మా శక్తి – హైదరాబాద్ ఫార్మా రాజధానికి కేంద్ర బలం

ప్రపంచ ఫార్మా రాజధానిగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌కు మరింత బలం చేకూర్చేందుకు "బయోఫార్మా శక్తి" పథకం కింద ₹10 వేల కోట్లు కేటాయించారు.

ఇది ఉద్యోగాలు, పెట్టుబడులు, పరిశోధనలకు కొత్త దారులు తెరవనుంది.

కేంద్రం నిధులు ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం క్రెడిట్ రాజకీయాల్లో మునిగిపోతోంది.

Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >
Image 1

ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"

Posted On 2026-06-30 13:21:42

Readmore >
Image 1

చీరతో చేతులు కట్టేసి మరీ... భర్తను నరికి చంపిన భార్య...

Posted On 2026-06-30 08:55:26

Readmore >
Image 1

ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య

Posted On 2026-06-30 08:20:14

Readmore >