| Daily భారత్
Logo




కూటమి అభ్యర్థుల గెలుపు..... వైరా అభివృద్ధికి మలుపు

News

Posted on 2026-02-02 17:49:19

Share: Share


కూటమి అభ్యర్థుల గెలుపు..... వైరా అభివృద్ధికి మలుపు

వైరా మున్సిపాలిటీలో కూటమి జెండాను ఎగురవేయాలి

సిపిఐ(ఎం) బీఆర్ఎస్ కూటమి అభ్యర్థులను గెలిపించండి

సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు.

డైలీ భారత్, వైరా: వైరా మున్సిపాలిటీలో ఎన్నికల్లో సిపిఐ(ఎం), బీఆర్ఎస్ కూటమి అభ్యర్థులను గెలిపించి వైరా మున్సిపాలిటీపై కూటమి జెండాను ఎగుర వేయాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం వైరా మున్సిపాలిటీ పరిధిలోని సిపిఐ(ఎం) సభ్యుల జనరల్ బాడీ సమావేశం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్ అధ్యక్షతన జరిగింది.  ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్ రావు, నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థుల పరిపాలనలో వైరా మున్సిపాలిటీ అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా తయారైందని అన్నారు. మున్సిపాలిటీలో జరిగిన అవినీతీపైన మున్సిపాలిటీ ప్రజల సమస్యల పరిష్కారానికి సిపిఐ(ఎం) పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని గుర్తుచేశారు. వ్యవసాయ రంగం పట్ల కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని విమర్శించారు. 57 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో నూటికి 56 శాతం మంది ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగానికి కేవలం ఒక లక్ష 86 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, ఎరువుల సబ్సిడీ 20 వేల కోట్లు తగ్గించారని అన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధి పట్ల, ఎరువుల సబ్సిడీ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, దీనివలన వ్యవసాయ రంగ అభివృద్ధి 4.4 శాతం నుంచి 3.6 శాతానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థుల గెలుపు వైరా మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రధాన మలుపు అవుతుందని, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న సిపిఐ(ఎం), టిఆర్ఎస్ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైరా మున్సిపాలిటీ పరిధిలో తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రైనేజీ, పేదల నివాస సమస్యలు వంటి ప్రజా సమస్యలపై సీపీఎం అనేక పోరాటాలు నిర్వహించిందని గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసే సీపీఎం, బీఆర్ఎస్ కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. అనంతరం మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలను వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు  బొంతు రాంబాబు,  మెరుగు సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, మెరుగు రమణ, కొండబోయిన నాగేశ్వరరావు, దుగ్గి కృష్ణ, బాణాల శ్రీనివాసరావు,  దొంతబోయిన నాగేశ్వరావు, కె.నరేంద్ర, చెరుకుమల్లి కుటుంబ రావు, మచ్చా మణి, బీఆర్ఎస్ బలపర్చిన సిపిఐ(ఎం) 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మాదినేని రజిని, 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గుడిమెట్ల రజిత, 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కిన్నెర కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >
Image 1

ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"

Posted On 2026-06-30 13:21:42

Readmore >
Image 1

చీరతో చేతులు కట్టేసి మరీ... భర్తను నరికి చంపిన భార్య...

Posted On 2026-06-30 08:55:26

Readmore >
Image 1

ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య

Posted On 2026-06-30 08:20:14

Readmore >