| Daily భారత్
Logo




ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

News

Posted on 2026-02-02 19:02:56

Share: Share


ఇంటర్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ప్రతిరోజూ ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు సరైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి, పరీక్ష విధులు నిర్వహించే ప్రతి అధికారి పూర్తి బాధ్యతతో పనిచేయాలని ఆదేశించారు.

పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి తప్పిదాలు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో మొత్తం 200 పరీక్ష కేంద్రాల ద్వారా 84,301 మంది మొదటి సంవత్సరం, 70,171 మంది రెండవ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని, ఇందుకు సంబంధించి 31 ప్రశ్నపత్రాల స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేయాలని, సెక్షన్ 144 అమలు చేయడంతో పాటు పరీక్షల సమయంలో జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని ఆదేశించారు.విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ అధికారులు తగిన సంఖ్యలో బస్సులు నడపాలని సూచించారు.

పరీక్ష కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులతో మెడికల్ పాయింట్లు ఏర్పాటు చేసి వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను ఆదేశించారు. అవసరమైన ఫర్నీచర్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.పోస్టల్ శాఖ అధికారులు జవాబు పత్రాలను సక్రమంగా రిసీవ్ చేసుకునేలా చూడాలని, పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ఫ్యాన్లు, టాయిలెట్లు వంటి మౌలిక సదుపాయాలు సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్‌ను నియమించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షించాలని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంక్యా నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి సుసిందర్ రావు, పోలీస్, పోస్టల్, ఆర్టీసీ, విద్యుత్, వైద్య శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఏసీబీ వలలో ఇరిగేషన్ అధికారి

Posted On 2026-06-29 23:17:29

Readmore >
Image 1

చలో ఐ అండ్ పి ఆర్ అడ్డుకున్న పోలీసులు

Posted On 2026-06-29 20:35:41

Readmore >
Image 1

లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం

Posted On 2026-06-29 18:52:51

Readmore >
Image 1

శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-29 18:51:47

Readmore >
Image 1

ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-06-29 18:50:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు

Posted On 2026-06-29 18:49:45

Readmore >
Image 1

అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:10:23

Readmore >
Image 1

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:09:16

Readmore >
Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >