| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

News

Posted on 2026-02-02 19:16:50

Share: Share


ఏసీబీకి చిక్కిన మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

డైలీ భారత్, నల్గొండ: నల్గొండ జిల్లా, గుర్రంపోడ్ మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఏసీబీ వలలో చిక్కుకున్నారు.. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం రోజు మధ్యాహ్నం సుమారు ఒంటిగంట ప్రాంతంలో సదరు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ హకీం గుర్రంపోడ్ మండలంలోని ఎంఆర్వో కార్యాలయ ప్రాంగణంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకురెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

కాగా బాధితుడికి చెందిన సర్వే నెం. 225/6, విస్తీర్ణం ఎకరాలు 1.15 గుంటలు గల భూమికి సంబంధించి, ఆన్‌లైన్ 1-బి రిజిస్టర్ అంటే ఆర్ ఓ ఆర్ లో తొలగించబడిన భూమి వివరాలను తిరిగి చేర్చేందుకు బాధితుడి దరఖాస్తు, సంబంధిత ఫైల్‌ను తహసీల్దార్‌కు ప్రాసెస్ చేసి పంపించడానికి గాను ఆ అధికారి రూ. 2,20,000/- లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్న సమయంలో పట్టుబడ్డారు. రూ. 20,000/- లంచం మొత్తం అతని వద్ద నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. బాధ్యత గలిగిన అధికారిగా ఉంటూ.. తన విధులను అక్రమంగా, అనైతికంగా నిర్వహిస్తూ, అనుచిత లాభం పొందినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

అందువల్ల, నిందిత అధికారిని అరెస్టు చేసి, హైదరాబాద్‌లోని అదనపు ప్రత్యేక న్యాయమూర్తి (ఎస్‌పీఈ అండ్ ఏసీబీ కేసులు) కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది.. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. కాగా భద్రతా కారణాల దృష్ట్యా, ఫిర్యాదుదారు పేరు, వివరాలు గోప్యంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు..

ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేసినట్లయితే, ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 ను సంప్రదించి చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా సహకరించవలసిందిగా అధికారులు కోరుతున్నారు.. అలాగే ఏసీబీ తెలంగాణ అధికారులను వాట్సాప్ : 9440446106..

ఫేస్‌బుక్ : తెలంగాణ ఏసీబీ.. ఎక్స్ : @Telangana ACB ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ ప్రజా ప్రదేశాల్లో ఏసీబీ తెలంగాణ క్యూఆర్ కోడ్ ప్రదర్శించబడింది. ఫిర్యాదుదారు పేరు, వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి.

Image 1

ఏసీబీ వలలో ఇరిగేషన్ అధికారి

Posted On 2026-06-29 23:17:29

Readmore >
Image 1

చలో ఐ అండ్ పి ఆర్ అడ్డుకున్న పోలీసులు

Posted On 2026-06-29 20:35:41

Readmore >
Image 1

లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం

Posted On 2026-06-29 18:52:51

Readmore >
Image 1

శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-29 18:51:47

Readmore >
Image 1

ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-06-29 18:50:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు

Posted On 2026-06-29 18:49:45

Readmore >
Image 1

అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:10:23

Readmore >
Image 1

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:09:16

Readmore >
Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >