Posted on 2026-02-05 21:17:24
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫిబ్రవరి 11వ తేదీన నిర్వహించే మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత గా పని చేయాలని సంబంధిత అధికారులకు ఎన్నికల అబ్జర్వర్ మయంక్ మిట్టల్ సూచించారు.
గురువారం శంకర్ పల్లి మున్సిపాలిటీకి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్, పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల అబ్జర్వర్ మయంక్ మిట్టల్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సి.నారాయణ రెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్బంగా ఎన్నికల అబ్జర్వర్ మయంక్ మిట్టల్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శంకర్ పల్లి మున్సిపాలిటీకి సంబంధించిన ఏర్పాట్లను, ఎన్నికల సామగ్రిని పరిశీలిస్తు అధికారులకు సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎన్నికలకు సంబంధించిన స్టేషనరీ తదితర అంశాలను మున్సిపల్ కమిషనర్ యోగేష్ ను అడిగి తెలుసుకొని వాటిని పరిశీలించారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి అన్నీ వసతులు కల్పించాలని, స్ట్రాంగ్ రూమును, కౌంటింగ్ హాల్ ను, పోలింగ్ నిర్వహించే పాఠశాలను పరిశీలించారు. ఎన్నికలు సజావుగా జరిగే విధంగా అధికారులు, సిబ్బంది అందరూ కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, కౌంటింగ్ ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ వివరించారు.
కలెక్టర్ వెంట శంకర్ పల్లి తహశీల్దార్, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >