| Daily భారత్
Logo




మహిళల రక్షణే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యం

News

Posted on 2026-02-06 16:59:13

Share: Share


మహిళల రక్షణే  షీ టీమ్స్ ప్రధాన లక్ష్యం

డైలీ భారత్, దమ్మన్నపేట: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు నేడు షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు సమాజాల్లో జరుగుతున్న ఆకృత్యాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు బోయన్న గారి నారాయణ తెలియజేశారు

ఈ సందర్భంగా  షీ టీం జిల్లా ఇన్చార్జి ప్రమీల మాట్లాడుతూ... 

మహిళలు,యువతులు,బాలికలు ఆకతాయిల వలన గానీ,మరే విధమైన వేధింపుల వలన గానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే నిర్భయంగా షీటీమ్స్ ని సంప్రదించవచ్చని  తెలిపారు.జిల్లాలో   విద్యార్థినులు,మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు.కళాశాల, పాఠశాలల విద్యార్థినులు ర్యాగింగ్,ఈవ్ టీజింగ్ లకు గురైనా,మహిళలు పని చేసే ప్రదేశాల వద్ద వేధింపులకు గురైనా,బాలికలపై ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడినా వెంటనే నిర్భయంగా షీ టీమ్ పోలీసులకు తెలుపాలి మహిళలు సామాజిక మాద్యమాలైన ఫేస్బుక్,వాట్సాప్,ఇన్స్టాగ్రామ్ వినియోగంలో జాగ్రత్తలు వహించాలని,వాటిలో ఫొటోలు,వీడియోలు పోస్టుచేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.నేరుగా  8712656425 ఫోన్ నంబరుకు లేదా డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని వారి వివరాలను గోప్యంగా ఉంచడం  జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా గంభీరావుపేట మండలంలోని ఎంపీపీ ఎస్ సముద్ర లింగాపూర్ జెడ్పిహెచ్ఎస్ సముద్రాళింగాపూర్ ఎంపీపీ ఎస్ నాగంపేట జెడ్పిహెచ్ఎస్ నాగంపేట ఎంపీపీ ఎస్ మల్లు పల్లి ఎంపీపీ ఎస్ దమ్మన్నపేట ఎంపీపీ ఎస్ కుర్దులింగంపల్లి ఎంపీపీ ఎస్ ముస్తఫా నగర్ పాఠశాలలు కూడా ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ప్రమీల తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో షీ టీం సభ్యులు వీరయ్య శ్రీనివాస్ ప్రియాంక శ్రీలతలు మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Image 1

ఏసీబీ వలలో ఇరిగేషన్ అధికారి

Posted On 2026-06-29 23:17:29

Readmore >
Image 1

చలో ఐ అండ్ పి ఆర్ అడ్డుకున్న పోలీసులు

Posted On 2026-06-29 20:35:41

Readmore >
Image 1

లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం

Posted On 2026-06-29 18:52:51

Readmore >
Image 1

శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-29 18:51:47

Readmore >
Image 1

ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-06-29 18:50:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు

Posted On 2026-06-29 18:49:45

Readmore >
Image 1

అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:10:23

Readmore >
Image 1

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:09:16

Readmore >
Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >