Posted on 2026-02-07 12:55:10
డైలీ భారత్, సిరిసిల్ల: పేద మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, ప్రభుత్వ పాఠశాలలో చదివి, కష్టసాధ్యమైన ప్రయాణం ద్వారా అమెరికాలో డాక్టర్‌గా స్థిరపడ్డ డా. కుసుమ విట్టల్ మరోసారి తమ సేవాభావాన్ని చాటుకున్నారు.
తాను చదువుకున్న కుసుమ రామయ్య ఉన్నత పాఠశాల, సిరిసిల్లకు రూ.10 లక్షల విరాళం అందజేసి, పేద విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన బాట వేశారు.
ఈ సహాయం 6వ నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న పేద విద్యార్థులందరికీ వారి విద్యా అవసరాలు, మౌలిక వసతులు, ప్రతిభాభివృద్ధికి ఉపయోగపడాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్థిక ఇబ్బందులు చదువుకు అడ్డుకాకూడదనే ఉద్దేశంతో ఈ విరాళం అందించడం విశేషం.
ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తన మూలాలను మరవకుండా, తాను ఎదిగిన పాఠశాలకే తిరిగి చేయూతనివ్వడం ఆయన దాతృత్వానికి నిలువెత్తు నిదర్శనం. ఈ విరాళం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ, “మేము కూడా ఉన్నత స్థానాలకు చేరగలం” అనే ఆశను రగిలిస్తోంది.
డా. కుసుమ విట్టల్ సేవాభావానికి సిరిసిల్ల ప్రజల హృదయపూర్వక అభినందనలు
విద్యే భవిష్యత్తు… సేవే నిజమైన సంపద.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోతిలాల్, స్టాఫ్ సెక్రటరీ శంకర్ గౌడ్, కుసుమ శ్రీధర్, వేముల శ్రీనివాస్, భూమేష్, పురుషోత్తం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >