Posted on 2026-02-07 17:39:46
యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి
14వ వార్డులో ఇంటింటి ప్రచారం
భారీ ఎత్తున తరలివచ్చిన యువ నాయకులు..
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: నిరంతరం ప్రజల మధ్యనే ఉండి సేవలు అందించే యువనేత అందెమోహన్ కు మీరు వేసే ఓటు వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుందని తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కడి శివచరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని 14 వ వార్డులో ఆయన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. వార్డులో ఇలాంటి సమస్య ఉన్న ఎమ్మెల్యే వీడ్లపల్లి శంకర్ సహకారంతో అందెమోహన్ పరిష్కరిస్తారని, ఎప్పటికీ అందుబాటులో ఉంటాడని తెలిపారు. అందమోహన్ కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. రంగారెడ్డి జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి, షాద్ నగర్ అసెంబ్లీ అధ్యక్షుడు పులిమామిడి రాజేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, కార్యదర్శి నరేందర్, అసెంబ్లీ ఉపాధ్యక్షుడు నిడదవెల్లి ఆమేన్, గుండాల అనిల్, నందిగామ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటాచారి, కొత్తూరు మండల అధ్యక్షుడు శివ గౌడ్, చౌదరిగుడా మండల అధ్యక్షుడు కుమార్, నందిగామ మండల ఉపాధ్యక్షుడు హరీష్, యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రదీప్, ఇసాక్,రాజేష్ రాహుల్, వంశీ, ఫిరోజ్, సచిన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు..
లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం
Posted On 2026-06-29 18:52:51
Readmore >
శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-29 18:51:47
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు
Posted On 2026-06-29 18:49:45
Readmore >
అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:10:23
Readmore >
నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-29 18:09:16
Readmore >
ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-29 11:48:10
Readmore >
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >