| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల : మున్సిపల్ ఎన్నికలపై పకడ్బందీగా నిఘా

News

Posted on 2026-02-08 16:43:28

Share: Share


రాజన్న సిరిసిల్ల : మున్సిపల్ ఎన్నికలపై పకడ్బందీగా నిఘా

అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి

ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే కేసులు తప్పవు.

స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలి

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీ భద్రత ఏర్పాట్లు

ప్రచార గడువు ముగిసిన తర్వాత ఎటువంటి ర్యాలీలు, సభలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదు.

సిరిసిల్ల డి.ఎస్.పి నాగేంద్రచారి

డైలీ భారత్, సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలు భయభ్రాంతులకు లోను కాకుండా,స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు యంత్రాంగం పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి తెలిపారు.

ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో జరిగేందకు చెక్‌పోస్టులు, వీడియో సర్వైలెన్స్ బృందాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని చెప్పారు. 

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అక్రమ మద్యం కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించామని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వారిపై పోలీస్ నిఘా నిరంతరం ఉంటుందని తెలిపారు.

ఎవరైనా ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించినా, డబ్బు, మద్యం లేదా ఇతర ప్రలోభాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

సోమవారం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని నిక్కచ్చిగా అమలు చేస్తున్నామని తెలిపారు.ప్రచార గడువు ముగిసిన తర్వాత ఎటువంటి ర్యాలీలు, సభలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నికల నియమావళిని గౌరవించి శాంతియుత ఎన్నికలకు సహకరించాలని కోరారు.

ప్రచారానికి బయటి నుంచి వచ్చిన వ్యక్తులు సోమవారం సాయంత్రం ఐదు గంటలలోపు సిరిసిల్ల మున్సిపల్ పరిధిని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా ఆదేశిస్తున్నాం.

సిరిసిల్ల ఓటర్లు ఉత్సాహంగా ముందుగానే పోలింగ్ స్టేషన్ చేరుకొని వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.

Image 1

చలో ఐ అండ్ పి ఆర్ అడ్డుకున్న పోలీసులు

Posted On 2026-06-29 20:35:41

Readmore >
Image 1

లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం

Posted On 2026-06-29 18:52:51

Readmore >
Image 1

శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-29 18:51:47

Readmore >
Image 1

ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-06-29 18:50:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు

Posted On 2026-06-29 18:49:45

Readmore >
Image 1

అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:10:23

Readmore >
Image 1

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:09:16

Readmore >
Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >