| Daily భారత్
Logo




మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

News

Posted on 2026-02-10 17:33:20

Share: Share


మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, చొప్పదండి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల పరిశీలన

డైలీ భారత్, కరీంనగర్: జిల్లాలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, చొప్పదండి, జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీలకు బుధవారం నిర్వహించనున్న ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు.

2వ మున్సిపల్ సాధారణ ఎన్నికలు-2026లో భాగంగా కరీంనగర్ జిల్లాలో పోలింగ్ జరగనున్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా చొప్పదండి మున్సిపాలిటీకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను చొప్పదండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేశారు.

ఈ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం సందర్శించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లోని ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్న ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల సామాగ్రిని చెక్ లిస్ట్  ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే రూట్, మానిటరింగ్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల సామాగ్రితో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లోనే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, అధికారులు సూచించిన చోటే బస చేయాలని  ఆదేశించారు. 

చొప్పదండిలో పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించాలని అన్నారు.  ఓటర్లు స్వేచ్ఛగా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Image 1

లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం

Posted On 2026-06-29 18:52:51

Readmore >
Image 1

శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-29 18:51:47

Readmore >
Image 1

ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-06-29 18:50:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు

Posted On 2026-06-29 18:49:45

Readmore >
Image 1

అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:10:23

Readmore >
Image 1

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:09:16

Readmore >
Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >